Flax Seeds : అవిసె గింజలను ఇలా తీసుకుంటే.. నెల రోజుల్లోనే 20 కిలోల వరకు బరువు తగ్గుతారు..!
Flax Seeds : అవిసె గింజలు తెలుసు కదా. అవి చాలా మంచి ఫుడ్. వాటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అది మంచి పౌష్ఠికాహారం. అందుకే.. అవిశె గింజలను నిత్యం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అవిసె గింజలు శరీరంలోని మెటబాలిజం రేటును పెంచుతాయి. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తాయి. అవిసె గింజలు శరీరంలో ఉన్న చెడు కొలెస్టరాల్ ను కరిగిస్తాయి. తద్వారా త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
అవిసె గింజల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే.. అవిసె గింజల్లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే.. చాలామంది అవిసె గింజలను నిత్యం తీసుకుంటారు. అయితే.. అవిసె గింజలను ఎలా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Flax Seeds : అవిసె గింజలను బాగా వేయించి తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు
శరీరంలో ఉండే అనవసర కొవ్వును త్వరగా తగ్గించుకోవాలంటే.. అవిసె గింజలను ఇలా తీసుకోవాల్సిందే. దాని కోసం అవిసె గింజలతో పాటు.. జీలకర్ర, కరివేపాకును సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి.. అందులో కొంచెం జీలకర్ర వేసి.. కొన్ని అవిసె గింజలు వేయండి. కొంత సేపు బాగా కలిపిన తర్వాత.. కొన్ని కరివేపాకు ఆకులు వేయండి. కొంచెం సేపు బాగా వేయించాక.. ఆ మిశ్రమాన్ని తీసుకొని మిక్సీలో పొడిగా చేయండి. ఆ పొడిని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని.. నిత్యం తీసుకుంటే.. శరీరంలో ఉన్న అధిక కొవ్వు, అనవసర కొవ్వు కరుగుతుంది. త్వరగా బరువు తగ్గుతారు. ఒక నెల రోజులు నిత్యం దీన్ని తీసుకుంటే.. కనీసం 20 కిలోల వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ పొడిని తీసుకోవడం వల్ల.. కేవలం అధిక బరువును తగ్గడమే కాదు.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలను నాశనం చేస్తుంది. ఊబకాయం సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అందుకే.. కేవలం బరువు తగ్గడం కోసమే కాదు.. ఇతర సమస్యలు ఉన్నా కూడా అవిసె గింజలతో చేసిన పొడిని నిత్యం తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఇది కూడా చదవండి ==> కోతుల నుంచి మనుషులకు సోకుతున్న కొత్త వైరస్.. ఇది కరోనా కన్నా డేంజర్?
ఇది కూడా చదవండి ==> నెయ్యి గురించి ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. నెయ్యి తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే?
ఇది కూడా చదవండి ==> మీ ఇంట్లోనే యాపిల్ చెట్టును పెంచుకోవచ్చు.. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..!
ఇది కూడా చదవండి ==> గోధుమ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా? చాలా అనారోగ్య సమస్యలు నయం అవుతాయి..!