Electricity Bill : వేసవికాలం కారణంగా కరెంట్ బిల్ వాచిపోతోందా… అయితే ఈ టిప్స్ పాటించండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Electricity Bill : వేసవికాలం కారణంగా కరెంట్ బిల్ వాచిపోతోందా… అయితే ఈ టిప్స్ పాటించండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :10 April 2024,10:00 am

Electricity Bill : వేసవికాలం రావడంతో భానుడి తాపాన్ని తట్టుకోలేక ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్యాన్లు ,ఏసీలు, కూలర్లు 24 గంటలు నడుస్తూనే ఉన్నాయి. దీని కారణంగా కరెంటు బిల్లు విపరీతంగా పెరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో గృహ జ్యోతి పథకం కింద కాంగ్రెస్ సర్కార్ 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నప్పటికీ వేసవికాలంలో 24 గంటలు ఏసీలు ,కూలర్స్ , ఫ్యాన్లు వినియోగించడం కరెంటు బిల్లు అమాంతం పెరుగుతుందని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా మీ కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Electricity Bill : తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయండి…

ఇంట్లో మనం ఫ్యాన్లు, లైట్లు వినియోగిస్తున్నప్పుడు స్విచ్ ఆన్ చేయడం అనేది సాధారణమైన పద్ధతి. అయితే చాలామంది స్విచ్ ఆన్ చేసి అవసరం లేని సమయంలో ఆఫ్ చేయడం మర్చిపోతున్నారు. కావున మీ అవసరం తీరిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోవడం తప్పనిసరి. తద్వారా నిరుపయోగంగా వృధా అవుతున్న విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు.

Electricity Bill : స్టాండ్ బై మోడ్…

ప్రస్తుత కాలంలో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది వాటిని రిమోట్ తోనే ఆఫ్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన TV అనేది స్టాండ్ బై మోడ్ లోకిి వెళ్ళిపోతుంది. ఇక ఈ సమయంలో టీవీ ఎక్కువ విద్యుత్ వినియోగించుకుంటుంది. తద్వారా మీ కరెంట్ బిల్లు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు టీవీ ఆఫ్ చేయాలంటే రిమోట్ కు బదులుగా నేరుగా స్పీచ్ ను ఆఫ్ చేయడం మంచిది.

Electricity Bill వేసవికాలం కారణంగా కరెంట్ బిల్ వాచిపోతోందా అయితే ఈ టిప్స్ పాటించండి

Electricity Bill : వేసవికాలం కారణంగా కరెంట్ బిల్ వాచిపోతోందా… అయితే ఈ టిప్స్ పాటించండి…!

Electricity Bill : 5 స్టార్ ఏసీల ఉపయోగం…

మీ ఇంట్లో ఏసీ ఉపయోగిస్తున్నట్లయితే కచ్చితంగా అది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ అయితే మీ కరెంట్ బిల్లు 40 % ఆదా అయినట్లే. అంతేకాక ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ పరికరాలను ఉపయోగించడం ద్వారా మీరు మరింత విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు. తద్వారా మీ కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. అలాగే ఫోన్ చార్జర్ లేదా లాప్టాప్ చార్జర్ వంటి పరికరాలను ఉపయోగించే సమయంలో స్విచ్ ఆన్ చేసి తర్వాత ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోకుండా వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది