Food Commission : గాడిదలు కాస్తున్నావా…అంగన్ వాడీ టీచర్ పై ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి సీరియస్ వీడియో వైరల్..!!
Food Commission : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుడ్ కమిషనర్ గా విజయ్ ప్రతాప్ రెడ్డి అంగన్ వాడీ కేంద్రాలలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీచర్ లేదా ఆయా పనితీరు బాగోకపోతే అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు అందించే ఆహారాన్ని స్వయంగా రుచి చూసి మరి.. తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వంటగది శుభ్రంగా ఉందా లేదా ఇంకా అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు.
అంగన్ వాడీ కేంద్రాలలో ఇంకా పాఠశాలలలో అందించే భోజనాలలో ఏదైనా లోపం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇదే సమయాలలో కేంద్రాలలో టీచర్లు మెయిన్టైన్ చేసే రికార్డులను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ తరహాలోనే బద్వేల్ జిల్లాలో ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి.. ఓ అంగన్ వాడీ సెంటర్ నీ తనిఖీ చేయడం జరిగింది. అయితే ఆ సెంటర్ టీచర్ అటెండెన్స్
రిజిస్టర్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయకపోవడంతో ఫుల్ సీరియస్ అయ్యారు. ఆబ్సెంటీస్ దిద్దేయటంతో రికార్డులు తారుమారు చేసే తరహాలో వ్యవహరించడంతో… గాడిదలు కాస్తున్నావా ఫిబ్రవరి నుండి కేసులు పెడతారని హెచ్చరించటం నీకు తెలియదా అని మండిపడ్డారు. ఇంకా స్టాక్ విషయంలో ఏ విధంగా రికార్డులు మైంటైన్ చేస్తున్నావు అంటూ అన్నిటిని పరిశీలించి ఆమెపై సీరియస్ అయిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది.