AP Forest Department : ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
ప్రధానాంశాలు:
AP Forest Department : ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
AP Forest Department : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి వేగం పెంచుతుంది. ఈ క్రమంలో అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
AP Forest Department : ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
AP Forest Department అటవీశాఖలో ఖాళీ పోస్టులకు భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయదలిచిన అభ్యర్థులు ఈ నెల జులై 16 నుండి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరించనున్నారు. అభ్యర్థులు ముందు నుంచే అవసరమైన విద్యార్హతలు, వయో పరిమితి వంటి అర్హతలను పరిశీలించుకుని దరఖాస్తు చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులకైనా అవకాశం లేకుండా జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, పరీక్షా విధానం, ఫీజు వివరాలు మొదలైనవి అధికారిక వెబ్‌సైట్ అయిన https://psc.ap.gov.in లో అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది మంచి అవకాశం కావచ్చు. ప్రకృతి ప్రేమికులు మరియు అటవీ సేవల పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు