Food Poisoning : ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే ఆహారాలు ఇవే.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి
Food Poisoning : ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో, ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ముఖ్యమైన ఆహారాల జాబితా వెలుగులోకి వచ్చింది. పాలకూరను తినే ముందు శుభ్రంగా కడగకపోతే ఇందులో ఉండే క్రిములు, పురుగుమందుల అవశేషాలు అనారోగ్యానికి దారితీస్తాయి. తాజా పాలకూరను సరైన రీతిలో వడకట్టి, శుభ్రంగా కడగక తప్పనిసరిగా వాడాలి.కోడి గుడ్లపై క్రిములు అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. అందుకే గుడ్లను బాగా కడిగి వాడటం అవసరం.
Food Poisoning : వీటి విషయంలో జాగ్రత్త..
పచ్చి చికెన్‌లో క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా ఉండే అవకాశముంది. చికెన్‌ను వాడేముందు బాగా కడగాలి. అలాగే వాడిన కట్టింగ్ బోర్డులు, కత్తులను శుభ్రంగా కడగడం అవసరం.ట్యూనా చేపను సరైన విధంగా నిల్వ చేయకపోతే స్కాంబ్రోటాక్సిన్ అనే హానికర టాక్సిన్ తయారవుతుంది. ఇది చర్మ దద్దుర్లు, వాంతులు, పొత్తికడుపు నొప్పి, డయేరియా, దృష్టి ముదురడం వంటి లక్షణాలకు కారణమవుతుంది. దీన్ని డీఫ్రాస్ట్ చేసి తక్షణమే వాడాలి.

Food Poisoning : ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే ఆహారాలు ఇవే.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి
చీజ్‌లో స్వయంగా విషతత్వం ఉండకపోయినా, కల్తీ పాలు లేదా అస్వచ్ఛమైన తయారీ ప్రక్రియ వల్ల ప్రమాదం ఏర్పడుతుంది. పాశ్చరైజ్డ్ పాలను మాత్రమే ఉపయోగించాలి. లేదంటే బ్రూసెల్లోసిస్, లిస్టెరియోసిస్ వంటి జబ్బులు వస్తే ప్రమాదమే.ఈ ఆహారాలను తినడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ శుభ్రత పాటించకపోతే మాత్రం ఆరోగ్యానికి గండం తప్పదు. కాబట్టి సరైన విధంగా కడగడం, నిల్వ చేయడం, వండడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్‌ను నివారించవచ్చు.