Health Tips : రాత్రి మిగిలిన అన్నం ఉదయం తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..
Health Tips : మన ఇండ్లల్లో చాలా మంది రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు ఉదయం తింటూ ఉంటారు. అన్నం వేస్ట్ చేయడం ఇష్టం లేని వారు ఇలా చేస్తూ ఉంటారు. మరి కొందరు దాన్ని వేడి చేసుకుని తీసుకుంటూ ఉంటారు. ఇలా రాత్రి వండిన ఆహారాన్ని ఉదయం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇదే కాకుండా ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ అయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎప్పటికప్పుడు వేడి వేడి ఆహారాన్ని తినాలని వారు సూచిస్తున్నారు.ఇలా రాత్రి చేసిన వంటను పొద్దున వేడి చేసుకుని తినే బదులు ఎప్పటికప్పుడు వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలి.
ఎందుకంటే రాత్రి వండిన ఆహారం.. ఉదయం మన తీసుకునే సమయానికి దాదాపు 10 గంటలు గడిచిపోతుంది. ఈ సమయంలో ఆ ఫుడ్ లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇది వంటగది టెంపరేచర్‌ను బట్టి ఉంటుంది. ఇలా బ్యాక్టీరియా ఫామ్ అయిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే చాన్స్ ఉంది. వాస్తవానికి అన్నం వండిన మూడు నుంచి నాలుగు గంటల్లోపే దానిని తినేసెయ్యాలి. అవసరమైనప్పుడు మళ్లీ వండుకుని వేడిగా తినాలి. దీని వల్ల ఎలాంటి సమస్యలు రావు.
Health Tips : ఎప్పటికప్పుడు వేడిగా..
చిన్న పిల్లల ఆహార విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. ఎందుకంటే వారు తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఎక్కువగా పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీని వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో హెల్త్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. బయటఫుడ్ తీసుకోవడం సైతం చాలా వరకు మానెయ్యటమే బెటర్. కూల్ డ్రింక్స్ కు సైతం దూరంగా ఉండాలి.