Ghee Vs Butter | నెయ్యి Vs వెన్న: ఆరోగ్యానికి ఏది మంచిది? .. నిపుణుల సమాధానం ఇదే!
Ghee Vs Butter | భారతీయ వంటకాలలో నెయ్యి, వెన్న కీలకమైన పదార్థాలు. రోటీ, పరాఠా, పప్పు, బిర్యానీ లాంటి వంటకాల రుచికి మజా అందించే ఈ రెండు పదార్థాల్లో, ఆరోగ్యానికి ఏది మంచిదో అనేది చాలా మందికి సందేహంగా ఉంటుంది. వీటిలో శరీరానికి మేలు చేసే పోషకాలు ఏమిటి? ఏదింటిలో కొవ్వు ఎక్కువ? ఆరోగ్య నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు అన్నదే ఇప్పుడు తెలుసుకుందాం.

#image_title
ఏది బెస్ట్
నెయ్యి అనేది వెన్నను వేడి చేసి దానిలోని నీరు, పాల ప్రోటీన్లను వేరు చేసిన తర్వాత తయారవుతుంది. దీనిలో విటమిన్ A, D, E, K పుష్కలంగా ఉండేాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి కంటి ఆరోగ్యం, ఇమ్యూనిటీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడతాయి.అంతేకాదు, నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో మంటను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. నెయ్యి జీవక్రియను వేగవంతం చేస్తుందన్నది మరో మేలు.
వెన్నలో విటమిన్ A, D, E, B12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రోటీన్, ఫైబర్ ఉన్నాయి. వెన్నలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడుతుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే వెన్నలో ఉండే లాక్టోస్, కేసీన్ అనే పాల ప్రోటీన్లు కొన్ని మందికి జీర్ణ సమస్యలు కలిగించవచ్చు.