Viral Video : ఆస్ట్రేలియాలో వింత ఘటన.. ఈ వీడియో చూస్తే మీరే బిత్తరపోతారు?
Viral Video : మీకు సాలీడు తెలుసు కదా. దాన్నే సాల పురుగు అని కూడా అంటాం. ఇంట్లో కూడా అప్పుడప్పుడు అవి కనిపిస్తుంటాయి. అవి వాటంతట అవే.. ఒక గూడును కట్టుకుంటాయి. ముఖ్యంగా పాత బడిన ఇండ్లలో, పూరాతన ప్రదేశాల్లో, మనుషులు ఎవ్వరూ రాని చోట అవి గూడ్లు కట్టుకొని నివసిస్తుంటాయి. వాటినే మనం సాలీడు గూళ్లు అంటాం. ఇంగ్లీష్ లో అయితే స్పైడర్ వెబ్ అని పిలుస్తుంటాం. సాలీడు తన నివాసం కోసం ఆ వెబ్ ను ఏర్పాటు చేసుకొని.. ఆ గూడు మీద జీవనం సాగిస్తుంది. మనుషులకు ఇల్లు ఎలాగో.. సాలీడుకు వెబ్ అలాగ అన్నమాట. అయితే.. మామూలుగా సాలీడు గూడు ఎంతుంటుంది. ఏదో చిన్నగా దానికి సరిపోయేంతగా ఉంటుంది.

giant spider webs blanketed in australia video viral
కానీ.. ఈ వీడియో చూస్తే మాత్రం మీరు బిత్తరపోతారు. ఎందుకంటే.. ఒక్క సాలీడు కాదు.. రెండు సాలీడులు కావు. లక్షల కొద్దీ సాలీడు పురుగులు ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో ఉన్న గిప్స్ ల్యాండ్ అనే ఏరియాను ఆక్రమించాయి. ఇక.. ఆక్రమించాక ఆగుతాయా.. ఆ ప్రాంతం మొత్తం మీద గూళ్లను కట్టేసుకున్నాయి. అంటే.. ఆ ప్రాంతాన్ని అవి కబ్జా చేశాయన్నమాట. అక్కడ గూళ్లను కట్టుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్క సాలీడు గూడు అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. లక్షల సాలీడు గూళ్లు అనేసరికి.. కొన్ని కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా.. సాలీడు గూళ్లే.
Viral Video : అవి మామూలు సాలీడులు కూడా కాదు
నిజానికి.. మనం ఇంట్లో చూసే సాలీడులు అయినా పెద్దగా ప్రమాదం లేదు కానీ.. అవి సాదాసీదా సాలీడులు కావట. అవి వాగ్రంట్ హంటర్ జాతికి చెందిన సాలీడులట. అంటే అవి భూమిలో ఎక్కువగా నివసిస్తాయట. కానీ.. అక్కడ బాగా నీటి వరద వస్తుండటంతో.. భూమిలో ఉండలేక బయటికి వచ్చి ఇలా గూళ్లను ఏర్పాటు చేసుకున్నాయట. ఇటీవల అక్కడ బాగా వర్షాలు పడటంతో వరద పొంగుకొచ్చింది.

giant spider webs blanketed in australia video viral
దీంతో.. సాలీడులన్నీ బయటికి వచ్చి.. అక్కడే ఉన్న చెట్లు, పొదలను ఆక్రమించి గూళ్లు కట్టేసుకున్నాయి. దీంతో అక్కడ ఎటు చూసినా.. సాలీడు గూళ్లే కనిపించాయి. దీన్ని చూసిన స్థానికులు బిత్తరపోయారు. ప్రస్తుతం ఆ సాలీడు గూళ్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ సాలీడు గూళ్లను చూసి నోరెళ్లబెడుతున్నారు.
