LifeStyle | మీ బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఐదు ఉంటే సమస్యలన్నీ మాయం
LifeStyle | ఆరోగ్య నిపుణులు రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయాన్నే తీసుకునే అల్పాహారం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆరోగ్యకరమైన అల్పాహారాలు మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడమే కాకుండా, బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.

#image_title
ఇవి చాలా బెస్ట్..
గ్రీకు పెరుగు ప్రొబయోటిక్స్‌తో సమృద్ధిగా ఉంటుంది, ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. బెర్రీలు యాంటీఆక్సిడెంట్లను అందిస్తే, చియా విత్తనాల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇడ్లీ, సాంబార్, కొబ్బరి చట్నీ కలయిక ఒక సంపూర్ణ, జీర్ణానికి అనుకూలమైన దక్షిణాది అల్పాహారం.ఇడ్లీ పులియబెట్టిన పదార్థం కావడం వల్ల ప్రోబయోటిక్స్‌ను అందిస్తుంది. సాంబార్‌లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొబ్బరి చట్నీ: ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది.ఈ మూడింటి సమ్మేళనం శరీరానికి తేలికగా జీర్ణమయ్యేలా చేసి, పేగులకు మేలు చేస్తుంది.
ఉదయం త్వరగా తయారు చేసుకోవాల్సిన అల్పాహారంగా పోహా అద్భుతమైన ఎంపిక. ఇందులో కలిపే కూరగాయలు, వేరుశెనగలు శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్‌ను అందిస్తాయి. తృణధాన్యాలతో చేసిన టోస్ట్‌పై అవకాడోను ముద్దగా వేసుకుని తినడం ద్వారా అధిక ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి లభిస్తాయి.మల్టీగ్రెయిన్ బ్రెడ్‌తో పాటు కూరగాయలతో చేసిన ఆమ్లెట్ తినడం వల్ల ప్రోటీన్, ఫైబర్, మరియు విటమిన్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీర శక్తిని పెంచడంలో, ఆకలి నియంత్రణలో, మరియు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది.