Good News : గుడ్ న్యూస్… కేవలం 10 సెకండ్లలోనే రుణాలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : గుడ్ న్యూస్… కేవలం 10 సెకండ్లలోనే రుణాలు…

 Authored By aruna | The Telugu News | Updated on :9 September 2022,8:00 am

Good News : లోన్ పొందాలనుకునే వారికి ఒక శుభవార్త వచ్చింది. దేశంలోనే ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఒకటి. ఈ బ్యాంక్ వినియోగదారులకు తీపి కబురుని అందించింది. అన్ సెక్యూరిడ్ రుణాలుగా చెప్పుకునే పర్సనల్ లోన్స్ అంశంపై కీలక ప్రకటన చేసింది. బ్యాంకులో ఖాతాలో లేని వారికి కూడా కేవలం 10 సెకండ్లలోనే రుణాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని బ్యాంక్ రిటైల్ అసెట్స్ హెడ్ అరవింద్ కపిల్ వెల్లడించారు. అంతేకాకుండా స్వయం ఉపాధి పొందుతున్న వారికి లోన్ సౌలభ్యం పెంచునున్నామని తెలిపారు. మార్కెట్లో తీవ్రమైన పోటీ జరుగుతుందని అలాగే డేటా లభ్యత మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల బ్యాంకు కూడా రుణ మంజూరు మరింత మందికి చేర్చాలని ఉద్దేశంతో ముందుకు వెళుతుందని తెలిపారు.

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఇప్పటికే ప్రస్తుత బ్యాంక్ కస్టమర్లకు 10 సెకండ్లలో ఋణ సదుపాయాన్ని అందిస్తూ వస్తుంది. గత ఆరేళ్లుగా ఈ సర్వీసులను విజయవంతంగా అందిస్తూ వస్తున్నాం. అందువల్ల ఇప్పుడు మరింత మార్కెట్ విస్తరణ పై ఫోకస్ పెట్టాం. ఈ సంవత్సరం చివరి నాటికి బ్యాంకులో అకౌంట్ లేనివారికి కూడా ఈ సర్వీసులను అందించాలని ప్లాన్ చేస్తున్నాం అని కపిల్ వివరించారు. కాగా హెచ్డిఎఫ్సి బ్యాంకుకు 1.2 కోట్ల ఫ్రీ అప్రూవ్డ్ లోన్ కస్టమర్ లు ఉన్నారు. బ్యాంక్ దేశవ్యాప్తంగా 650 జిల్లాల్లో పర్సనల్ లోన్స్ అందించేలా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజ్మెంట్ ప్రకారం స్వయం ఉపాధి పొందుతున్న వారికి రుణలభ్యత కేవలం 5% గానే ఉంది.

HDFC Bank give personal loans with in 10 seconds

HDFC Bank give personal loans with in 10 seconds

అందుకు బ్యాంక్ వీరికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తుంది. 2022 జూన్ నెల చివరి నాటికి రిటైల్ లోన్స్ లో పర్సనల్ లోన్స్ అధిక వాటాను కలిగి ఉన్నాయి. 1.48 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే వీటిలో 10 సెకండ్లలోనే రుణాలు అధిక వాటాను ఆక్రమించాయి. హెచ్డిఎఫ్సి తో విలీనం అంశంపై దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందిన క్రమంలో మోర్ట్ గేజ్ రుణాలకు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. 2023 సెప్టెంబర్ నాటికల్లా విలీనం పనులు పూర్తి కావచ్చని బ్యాంక్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం బ్యాంక్ 440 జిల్లాల్లో మోటిగేజ్ లోన్ సర్వీసులను అందిస్తుంది. ఈ సంఖ్యను మరింత పెంచుకోవాలని బ్యాంక్ భావిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది