Good News : గుడ్ న్యూస్.. వారి ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేసిన సీఎం జగన్..!!
Good News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చదువు విషయంలో ఏమాత్రం ఖర్చుకు వెనకాడటం లేదు. ప్రతిపక్షాలు అభివృద్ధి ఏది అని విమర్శలు చేస్తుంటే మనిషి జీవితాన్ని మార్చే చదువు విషయంలో పెట్టుబడి పెట్టటం అభివృద్ధియే అనీ… ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడే రీతిలో జగన్ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుందని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన నాటినుండి దాదాపు 50 వేల కోట్లకు పైగానే చదువు విషయంలో జగన్ ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. స్కూల్లో చదివే విద్యార్థి మొదలుకొని కాలేజీలో చదివే విద్యార్థులు ఇంకా విదేశాలలో చదివే విద్యార్థులకు ఆర్థికంగా పలు సంక్షేమ పథకాల రూపంలో… ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా లా నేస్తం పథకం కింద… రాష్ట్రంలో అర్హులైన 2011 మంది జూనియర్ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,55,000 విడుదల చేయడం జరిగింది.
బుధవారం సీఎం జగన్ ఈ మొత్తాన్ని సదరు జూనియర్ లాయర్ ఖాతాలో నేరుగా మటన్ నొక్కి జమ చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వైయస్సార్ లా నేస్తం పథకం కింద లబ్ది పొందుతున్న 2011 జూనియర్ లాయర్ లకు కోటి 55 వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేశారు. పాదయాత్రలో భాగంగా జూనియర్ న్యాయవాదుల సమస్యలు విన్న జగన్ ఆ పథకానికి శ్రీకారం చుట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. న్యాయవాదులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పటం కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా న్యాయవృత్తిలో ఉన్న మీకు మంచి జరగటం వల్ల రాబోయే రోజుల్లో మీరు మరొకరికి మంచి చేయాలనే ఆలోచన పుడుతుందని చెప్పుకొచ్చారు. లా చదువు ముగించుకుని తర్వాత మూడు సంవత్సరాలు వృత్తిలో ఉతమివ్వటానికి వారు స్థిరపడటానికి… ఈ పథకం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
ఈ నగదును ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి రెండు దఫాలుగా ఇచ్చే రీతిలో ఆలోచన చేసినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం వందకోట్ల రూపాయలతో లాయర్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ క్రమంలో అర్హులైన న్యాయవాదులకు ఇన్సూరెన్స్ ఇంకా ఇతర వైద్య అవసరాల కోసం లోన్స్.. పరంగా ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తారు అని పేర్కొన్నారు.