Diabetic : షుగర్ పేషెంట్లకు సూప‌ర్ న్యూస్… ఈ చికిత్సతో పూర్తిగా న‌యంలో చైనా పరిశోధకులు స‌క్సెస్‌ ? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Diabetic : షుగర్ పేషెంట్లకు సూప‌ర్ న్యూస్… ఈ చికిత్సతో పూర్తిగా న‌యంలో చైనా పరిశోధకులు స‌క్సెస్‌ ?

Diabetic : ప్రస్తుతం మనం ఉన్న ఈ కాలంలో చెడు ఆహారపు అలవాట్ల వలన ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. అయితే ఈ సమస్యలలో ఒకటి షుగర్. ఈ షుగర్ వ్యాధి వచ్చింది అంటే దీనిని పూర్తిగా నయం చేయలేము అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ చైనా పరిశోధకులు షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేశారు. అది కూడా కేవలం 11 వారాలలోనే దీనికి సంబంధించిన ఇన్సులిన్ లు కూడా పూర్తి చేశారు. సెల్ థెరపీతో […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 May 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Diabetic : షుగర్ పేషెంట్లకు సూప‌ర్ న్యూస్... ఈ చికిత్సతో పూర్తిగా న‌యంలో చైనా పరిశోధకులు స‌క్సెస్‌ ?

Diabetic : ప్రస్తుతం మనం ఉన్న ఈ కాలంలో చెడు ఆహారపు అలవాట్ల వలన ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. అయితే ఈ సమస్యలలో ఒకటి షుగర్. ఈ షుగర్ వ్యాధి వచ్చింది అంటే దీనిని పూర్తిగా నయం చేయలేము అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ చైనా పరిశోధకులు షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేశారు. అది కూడా కేవలం 11 వారాలలోనే దీనికి సంబంధించిన ఇన్సులిన్ లు కూడా పూర్తి చేశారు. సెల్ థెరపీతో అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేశారు. వైద్య చరిత్రలోనే గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం అంటే. క్రోమంలోని కణజాలంపై షుగర్ వ్యాధి ఏ విధంగా ప్రభావం చేయగలదో,క్రియేటెడ్ అల్గారిద్దం ద్వారా మొదటి రీసెర్చ్ చేస్తారు. దాని తర్వాత రోగి రక్తం లోని మూల కాణా లను అనగా సీడ్ సెల్స్ ల ను తీసుకోని సెల్ థెరపీతో వాటిలో కొన్ని మార్పులను చేస్తారు. దాని తర్వాత క్రమంలో ప్రభావితమైన కణాలను కూడా ఆ స్థానంలో ట్రాన్స్పరెంట్ లో కూడా ప్రవేశపడతారు. ఈ తరుణంలో రోగికి ఇచ్చే ఇన్సులిన్ ఇతర మందుల మోతాదులను కూడా తగ్గిస్తారు. ఈ ప్రయోగం అనేది సత్ఫలితాలను కూడా ఇస్తుంది అని పరిశోధకులు తెలుపుతున్నారు.

జులై 2021 లో మొదట నాలుగు మంది రోగులకు ఇలా సెల్ ట్రాన్స్ ప్లాంట్ చేసామని, 11 వారాలు టైం లోనే అతను ఇన్సూరెన్స్ ఇతర మందులను వాడటం పూర్తిగా మానివేసినట్లుగా పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం అయితే ఆ వ్యక్తికి మాత్రం డయాబెటిస్ సంపూర్ణంగా నయమైంది అని కూడా తెలిపారు. చివరి మూడు నెలలుగా ఆ వ్యక్తి ఇన్సులిన్ తీసుకోవడం లేదు అని తెలిపారు. చైనాలోని చాంగ్ జంగ్ ఆసుపత్రి, రేంజ్ ఆస్పత్రి వైద్యులు సంయుక్తంగా ఈ ప్రయోగాలనేవి చేశారు. డయాబెటిస్ ట్రీట్మెంట్ సెల్స్ ప్రయోగం గొప్ప ముందడుగు అని సాకేతికత విస్తృతంగా అందుబాటులోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ తో బాధపడుతున్నవారికి కోట్లాది మందికి కూడా ఎంతో ఆర్థికంగా, శారీరకంగా రిలీఫ్ వస్తుంది అది పలువురు వైద్య నిపుణులు తెలిపారు.

Diabetic షుగర్ పేషెంట్లకు సూప‌ర్ న్యూస్ ఈ చికిత్సతో పూర్తిగా న‌యంలో చైనా పరిశోధకులు స‌క్సెస్‌

Diabetic : షుగర్ పేషెంట్లకు సూప‌ర్ న్యూస్… ఈ చికిత్సతో పూర్తిగా న‌యంలో చైనా పరిశోధకులు స‌క్సెస్‌ ?

2021 లెక్కల ప్రకారం చూస్తే, ప్రపంచ వ్యాప్తంగా కూడా 53.7 కోట్ల మంది డయాబెటిస్ తో బాధపడుతూ ఉన్నారు. డయాబెటిస్ చికిత్సకు కేవలం 2021లో రోగులు ఖర్చు చేసినటువంటి డబ్బులలో 9 66 బిలియన్ డాలర్లు. దీనిలో మరి ముఖ్యంగా చెప్పాలంటే. ప్రతి ఏడుగురు షుగర్ రోగులలో ఒకరు భారతీయులై ఉన్నారు అని లెక్కలు చెబుతున్నారు. గోవాలోని మొత్తం జనాభాలో 26% మంది డయాబెటిస్ రోగులు ఉన్నారు అని సర్వే తెలిపింది. ప్రపంచంలోనే ప్రతి పది మందిలో కూడా ఒకరు డయాబెటిస్ తో బాధపడుతూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ తగ్గించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ సెల్ థెరపీతో చైనా శాస్త్రవేత్తలు వేసిన ముందడుగు వైద్యశాస్త్రంలో అరుదేన ఘనతగా చెప్పుకోవచ్చు అని విశ్లేషకులు తెలిపారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది