Diabetic : దురదతో పాటు శరీరంపై మొటిమలు వస్తే పెద్ద ప్రమాదం ముంచుకొస్తున్నట్టే..!
Diabetic : యుక్త వయస్సులో చాలా మంది ముఖంపై మొటిమలని మనం చూస్తూ ఉంటాం. అమ్మాయిలు, అబ్బాయిలను సౌందర్యపరంగా ఇబ్బందిపెట్టే సమస్యల్లో ఇది ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. కాలుష్యం, శరీరంలో వేడి, అధిక సెబమ్ విడదల కావడం, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపాలు, జన్యుపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల మొటిమల సమస్య బాగా వేధిస్తూ ఉంటుంది. అయితే వీటి వలన పెద్ద సమస్య ఉండదు. కాని దురదతో వచ్చే మొటిమలు మాత్రం మనకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అలా వచ్చిందంటే మనం తగు జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఎంతైన ఉంది.
Diabetic వీటిని అస్సలు విస్మరించవద్దు…
మన శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగితే డెర్మోపతి వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్‌లోని ఒక రకమైన చర్మ వ్యాధి ఇది. ఈ వ్యాధి సోకినప్పుడు శరీరంలోని అనేక భాగాలలో చిన్న చిన్న మొటిమలు, గుండ్రటి పుండ్లు, గాయాలు మనకి కనిపిస్తుంటాయి.. ఇవి మడమ భాగాలపై.. అంటే కాళ్ళ పైభాగాలు.. ముఖంపై కనిపిస్తాయి. ఈ సమస్యలను చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. అందువల్ల ఇలాంటి వాటిని తేలికగా తీసుకోవద్దని, ఇవి రక్తంలో చక్కెర పరిణామం పెరిగినప్పుడు కలిగే సంకేతాలని వైద్య నిపుణులు అంటున్నారు. లక్షణాలు చూస్తే ముందుగా మన శరీరంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు, పాదాల పైభాగాల చర్మంపై చిన్న నలుపు, గోధుమ రంగులో గాయాలు ఏర్పడతాయి. వాటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.
ఇక చర్మంపై చిన్న చిన్న మొటిమలు కనిపిస్తే.. ఇవి రక్తంలో అధిక చక్కెరను సూచిస్తాయి. అటువంటి పరిస్థితిలో, వెంటనే ఆరోగ్య నిపుణుల నుంచి సహాయం తీసుకోవాలి. ఇక శరీరంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు, చర్మంపై గాయాలు, పుండ్లు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు అవి డయాబెటిస్ సంకేతాలుగా కూడా చెప్పవచ్చు. ఇక చర్మంపై ఊదా, ఎరుపు, గోధుమ లేదా పసుపు రంగు గుర్తులు కనిపిస్తే, అది అధిక రక్తంలో చక్కెర స్థాయికి సంకేతం కూడా కావచ్చు. ఇక ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య మరీ మరీ వస్తే అది రక్తంలో చక్కెర స్థాయిని పెంచడాన్ని సూచిస్తుంది. దీని కారణంగా, చర్మంపై దురద సంభవించే అవకాశం కూడా ఉంది . ఇది చాలా కాలం పాటు జరిగితే, దానిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఎంతైన ఉంది.