Good News : రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అదేంటంటే…!
Good News : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఆర్థికంగా ఎంతగానో సహాయపడుతున్నారు. దీని ద్వారా చాలామంది రైతులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దృష్టిలో ఉంచుకొని వారికి మేలు చేసే విధంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. దీంతోపాటు ఇప్పుడు రుణం పొందిన రైతులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం ద్వారా చాలామంది రైతులకు మంచి ప్రయోజనం కలగనుంది. హర్యానా ప్రభుత్వం రుణం పొందిన రైతులకు వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించింది.
దీంతో పాటు రైతుల అనేక ఖర్చులు కూడా మాఫీ కానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకంతో రైతులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అప్పుల పాలైన రైతుల కోసం హర్యానా వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించింది. రుణం పొందిన రైతులు లేదా జిల్లా వ్యవసాయ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ సభ్యులకు వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించింది.
ఈ సందర్భంగా హర్యానా రాష్ట్ర సహకార మంత్రి బళ్లారి లాల్ మాట్లాడుతూ రుణ సభ్యులకు ప్రకటించిన పథకం కింద బకాయి ఉన్న వడ్డీ పై వంద శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రుణం తీసుకున్న రైతు చనిపోతే అతని వారసులు 2022 మార్చి 31 లోపు అసలు మొత్తాన్ని జమ చేస్తే ఈ మినహాయింపు ఉంటుందని తెలిపారు.దీనికోసం అసలు మొత్తాన్ని రుణ ఖాతాల్లో జమ చేస్తే మరణించిన రుణ గ్రహీతల వారసులకు వడ్డీల 100% రాయితీ అందించబడుతుందని ఆయన చెప్పారు. దీంతోపాటు ఇతర ఖర్చులు కూడా మాఫీ కానున్నాయి .బ్యాంకులో చనిపోయిన రుణ గ్రహీతల సంఖ్య 17,863 కాగా వారి మొత్తం బకాయిలు 445.29 కోట్లు అని, ఇందులో అసలు మొత్తం 174.38 కోట్లు, వడ్డీ 20041.45 కోట్లు, అపరాధ వడ్డీ 29.46 కోట్లు ఉన్నాయి.