Good News : కారు కొనాలనుకునే వారికి శుభవార్త .. ఏకంగా రూ. 57 వేల తగ్గింపు..!
Good News : కార్లపై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. కారు కొనాలనుకునేవారు ఇదే నుంచి సమయం. ఏకంగా వేలల్లో డబ్బులను ఆదా చేసుకోవచ్చు. అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయినా మారుతి సుజుకి కార్లపై అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏకంగా 57 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్లు నవంబర్ నెలలో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎక్సైంజ్ ఆఫర్, క్యాష్ బ్యాక్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి వాటి తో మారుతి కార్ ను తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు కార్ మోడల్, ఏరియా, షోరూమ్ ప్రాతిపదికను మారుతూ ఉంటాయి. దగ్గరలోని డీలర్ షిప్ వద్దకు వెళ్లి ఆఫర్ వివరాలు తెలుసుకోవడం మంచిది.
1) ఆల్టో కే10 కారుపై భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారుపై ఏకంగా 57వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ 35 వేల వరకు ఉంటుంది. కార్పొరేట్ బెనిఫిట్ 7వేల దాకా ఉంది. ఆఫర్ కింద 15 వేల వరకు తగ్గింపును పొందవచ్చు.
2) అలాగే సెలెరియో కారుపై కూడా భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ కార్ ను 56 వేల వరకు తగ్గింపు తో సొంతం చేసుకోవచ్చు. కార్పొరేట్ బెనిఫిట్ 6000 ఉంది. ఎక్సేంజ్ బోనస్ 15000 దాకా లభిస్తుంది. ఇక క్యాష్ డిస్కౌంట్ 35,000 వరకు పొందవచ్చు.
3) అలాగే డిజైర్ మోడల్ కారుపై కూడా భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. ఈ కారుపై 32 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. కార్పొరేట్ బెనిఫిట్ కింద 7000 దాకా తగ్గింపు ఉంది. క్యాష్ డిస్కౌంట్ 15 వేల దాకా పొందవచ్చు. ఇంకా ఎక్స్చేంజ్ బోనస్ పదివేల దాకా వస్తుంది.
4) ఎస్ ప్రేసో కారుపై కూడా తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు. ఈ కారుపై 56 వేల వరకు డిస్కౌంట్ ఉంది. 35 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. కార్పొరేట్ బెనిఫిట్ 6000 వరకు లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ 15000 దాకా పొందవచ్చు.
5) మారుతి స్విఫ్ట్ కారుపై 35 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఐదు గేర్లు ఉంటాయి. మ్యానువల్ ఏఎంటి వేరియంట్ల రూపంలో ఈ కారు లభిస్తుంది.
6) వ్యాగనార్ కార్ పై కూడా భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారుపై 41 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ 20 వేల దాకా ఉంటుంది. కార్పొరేట్ బెనిఫిట్ కింద 6000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్సేంజ్ బోనస్ 15000 వరకు ఉండబోతుంది.