Good News : గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం… పిపిఎఫ్, సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టిన వారికి అవి పెరగనున్నాయి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News : గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం… పిపిఎఫ్, సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టిన వారికి అవి పెరగనున్నాయి…

Good News : ప్రభుత్వం పిపిఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్పీఎస్ లేదా కిసాన్ వికాస్ పత్ర మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నివేదికల ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటులో మార్పులు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణంతో వడ్డీ రేటు పెరుగుదల మధ్య బ్యాంకుల వడ్డీ రేటు మునుపటి కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చని అంచనా. ప్రభుత్వం చేసిన […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 September 2022,8:00 am

Good News : ప్రభుత్వం పిపిఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్పీఎస్ లేదా కిసాన్ వికాస్ పత్ర మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నివేదికల ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటులో మార్పులు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణంతో వడ్డీ రేటు పెరుగుదల మధ్య బ్యాంకుల వడ్డీ రేటు మునుపటి కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చని అంచనా. ప్రభుత్వం చేసిన మార్పులు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఆర్.బి.ఐ మూడుసార్లు రేపో రేటును 1.4% పెంచింది. దీని తర్వాత వివిధ బ్యాంకులు ఎఫ్ డి, ఆర్ డీ వడ్డీ రేటును పెంచాయి.

చిన్న పొదుపు పథకం పై వడ్డీ రేట్లపై ఈ సమీక్ష 2022 అక్టోబర్ నుండి డిసెంబర్ లో జరగనుంది. ఈసారి ప్రభుత్వం నుంచి పొదుపు పథకాలపై వడ్డీ రేటు పెరుగుతుందని అంచనా ఉంది. చాలా కాలంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. రానున్న కాలంలో వడ్డీరేట్లలో మార్పు ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని పెంచడానికి బ్యాంకులు, ఆర్బిఐ రెండు అనుకూలంగా ఉన్నాయి. ఆర్బిఐ మే నుండి రెపో రేటును మూడుసార్లు పెంచింది. ఇది ప్రస్తుతం ఐదు పాయింట్ నాలుగు శాతం వద్ద కొనసాగుతుంది. రానున్న కాలంలో 25 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ పథకాల్లో ఎటువంటి మార్పులు రాలేదు.

Good News Govt may increase interest on PPF sukanya samruddhi yojana schemes

Good News Govt may increase interest on PPF, sukanya samruddhi yojana schemes

అటువంటి పరిస్థితుల్లో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పై రాబడి కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లు సవరించబడతాయి. చిన్న పొదుపు పథకాలపై వడ్డీని ప్రభుత్వం ప్రతి మూడు నెలలకి పరీక్షిస్తుంది. ఈ సమీక్ష సమయంలో వడ్డీ రేటును పెంచాలా తగ్గించాలా లేదా స్థిరంగా ఉంచాలనే నిర్ణయం తీసుకోబడుతుంది. ఈ వడ్డీ రేట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్ పై 7.1 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. అదే సమయంలో సుకన్య సమృద్ధి యోజన లో పెట్టుబడి పెట్టే వారికి 7.6% వార్షిక రాబడి ఇవ్వబడుతుంది. అదేవిధంగా కిసాన్ వికాస్ పత్ర పై వడ్డీ రేటు 6.9 శాతం గా ఉంది. అదే విధంగా మీరు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ల ఖాతాలో 5.8% రాబడిన కలిగి ఉంటారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది