Good News : రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ పైసలు.. వచ్చేది ఎప్పుడంటే..
Good News : కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతోంది. అందులో ప్రత్యేకించి రైతుల కోసం సైతం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఇందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనా పథకం ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. ఈ ఆరు వేలను రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 10 విడతలుగా డబ్బులు రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం.. మరో 11 విడత డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయి. అవి ఎవరికి అందుతాయి. వాటికి ఎవరు అర్హులు, డబ్బులు పొందేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇప్పటి వరకు పది విడతల్లో డబ్బులు రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 11 విడత డబ్బులను అందించనుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతను ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్యలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తుంది. ఆగస్టు నుంచి నవంబర్ 30వ తేదీ లోపు రెండో విడత డబ్బులను పంపిణీ చేస్తుంది. ఇక డిసెంబర్ 1 నుంచి మార్చి 31వ తేదీ లోపు ఎప్పుడైనా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసే చాన్స్ ఉంది. ఇందుకు వ్యవసాయ భూమి ఉన్న రైతులంతా అర్హులే. మరి ఇందులో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం.

Good News in pm kisan money into accounts
Good News : ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో..
ముందుగా pmkisan.gov.inను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత FARMER CORNERS అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ కొత్త ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం అందులో ఆధార్ నంబర్ ను నమోదు చేసి క్యాప్చా పూర్తి చేయాలి. తర్వాత బ్యాంక్ కు సంబంధించిన వివరాలను ఎంట్రీ చేయాలి. తర్వాత ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో భూమికి సంబంధించి డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇందు కోసం భూమి అసలు పత్రాలు, దరఖాస్తుదారుడి బ్యాంక్ పాస్‌బుక్, ఓటర్ కార్డు, ఫొటో తదితర పాత్రాలు అవసరం.