SBI Good News : ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు!
SBI Good News : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. మూడో త్రైమాసికం రికరింగ్ డిపాజిట్లు (RD)వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. సామాన్య వినియోగదారులకు 5.1 నుంచి 5.4 శాతానికి మధ్యలో ఆర్‌డీ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్న ఎస్బీఐ.. సీనియర్ సిటిజన్లకు మరో 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ పెంపు ఉంటుందని వెల్లడించింది. ఈ కొత్త రేట్లు 15 జనవరి 2022 నుంచే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. వంద రూపాయల డిపాజిట్‌తోనే రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ) అకౌంట్ తెరిచే అవకాశాన్ని ఎస్‌బీఐ ప్రజలకు కల్పిస్తోంది. 12 నెలల నుంచి 10 ఏళ్ల సమయం వరకు ఎంత కాలానికైనా ఆర్‌డీ అకౌంట్‌ను తెరుచుకోవచ్చు. అన్ని టెన్యూర్లపై సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీని ఎస్‌బీఐ ఆఫర్ చేస్తుంది.
దేశంలో రికరింగ్ డిపాజిట్ అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన సేవింగ్ స్కీం. ఆర్‌డీ అకౌంట్‌లో, కస్టమర్లు తమ పేమెంట్లను వాయిదా పద్ధతిలో చెల్లింపు చేసుకోవచ్చు. మెచ్యూరిటీ ముగిసాక ఆ మొత్తం మీ చేతికి వస్తుంది. వాయిదా మొత్తం ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత దానిని మళ్లీ మార్చుకోవడం సాధ్యపడదు.కొత్తగా అమల్లోకి వచ్చిన వడ్డీ రేట్లు ఎలాగున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఆర్‌డీలకు.. 5.1 శాతం వడ్డీ రేటు ఇస్తుండగా.. రెండేళ్ల నుంచి మూడేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఆర్‌డీలకు 5.1 శాతం వడ్డీ రేటు, మూడేళ్ల నుంచి ఐదేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఆర్‌డీలకు..
SBI Good News : అసలు ఆడీ అంటే ఏమిటి..
5.3 శాతం వడ్డీ రేటు, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకున్న డిపాజిట్లకు 5.4 శాతం వడ్డీ రేటుగా నిర్ణయించారు. ఎస్‌బీఐలో ఆర్‌డీ అకౌంట్ లేనివారు రెండు విధానాల్లో అకౌంట్‌ను తెరుచుకోవచ్చు. బ్యాంకుకు వెళ్లి లేదా ఆన్ లైన్ ద్వారా.. ఎస్‌బీఐ ఖాతాదారు అయితే మీ నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఆన్‌లైన్‌లోనే ఈ-ఆర్‌డీని తెరవవచ్చు. ఎస్‌బీఐ మీ ఆర్‌డీ మనీని గడువు కంటే ముందే విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఒకవేళ మీకు మెచ్యూర్ అయ్యే సమయం కంటే ముందే ఆర్‌డీ మనీని విత్ డ్రా చేసుకోవాలనుకుంటే కాస్త పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.