7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హోలీ సందర్భంగా డబుల్ ధమాకా.. భారీగా పెరగనున్న జీతాలు
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం డీఏ పెంపు, డీఏ బకాయిల చెల్లింపు, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ మూడు డిమాండ్లను కేంద్రానికి వినిపిస్తున్నా కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే వచ్చే నెల హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనున్నట్టు తెలుస్తోంది.ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను వచ్చే నెల కేంద్రం సవరించబోతున్నట్టు తెలుస్తోంది.
మార్చి 8 న హోలీ పండుగ తర్వాత ఫిట్ మెంట్ పర్సెంటేజ్ ను కేంద్రం పెంచనుందట. నిజానికి మార్చి 1న కేంద్ర కేబినేట్ సమావేశం ఉంది. ఈ సమావేశంలోనే ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ తో పాటు డీఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫిట్ మెంట్ ను 2.57 నుంచి 3.68 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే బేసిక్ వేతనం రూ.18 వేలు ఉన్న వాళ్లకు 3.68 శాతానికి గాను రూ.26 వేల జీతం కానుంది.
7th Pay Commission : ఫిట్ మెంట్ ను 2.57 నుంచి 3.68 కి పెంచుతారా?
అందుకే హోలీ పండుగ తర్వాత ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ తో పాటు డీఏను కూడా పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి.. డీఏను జనవరిలోనే పెంచాలి. గత సంవత్సరం సెప్టెంబర్ లో డీఏను పెంచగా మళ్లీ ఇప్పటి వరకు పెంచలేదు. దీంతో కనీసం 3 శాతం డీఏ పెరిగి.. 38 శాతం నుంచి 41 శాతం డీఏ పెరిగే చాన్స్ ఉంది. అలాగే.. డీఏ బకాయిలను కూడా కేంద్రం వచ్చే నెలలోనే చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.