YSRCP : రఘురామకృష్ణంరాజు ప్లేస్ లో కత్తి లాంటి నేతతో భర్తీ చేస్తున్న సీఎం జగన్?
YSRCP : వైఎస్సార్సీపీ పార్టీ ప్రస్తుతం బజారున పడిందంటే దానికి కారణం ఒక్కరే. ఆయనే రఘురామకృష్ణంరాజు. పార్టీ పేరును బజారుకీడ్చి.. ఏపీ ప్రభుత్వం మీద, సీఎం జగన్ మీద ఆయన చేసిన విమర్శలు మామూలుగా లేవు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని.. రఘురామను ఇటీవల సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రఘురామతో వైసీపీ బంధాన్ని దాదాపు తెంపుకున్నట్టే లెక్క. 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో వైసీపీలో చేరి.. నర్సాపురం ఎంపీ టికెట్ ను పొందారు రఘురామకృష్ణంరాజు. ఎంపీగా గెలిచిన ఆరు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు ఎదురు తిరిగారు. అప్పటి నుంచి ఢిల్లీలోనే మకాం వేసి.. సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు.
రఘురామకృష్ణంరాజు వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సాగింది. వైసీపీ నేతలంతా రఘురామకృష్ణంరాజుపై ఎన్ని విమర్శలు చేసినా.. ఎంత భయపెట్టినా.. రఘురామ మాత్రం భయపడలేదు. తనను అరెస్ట్ చేసి.. చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు తప్పితే ఆయన మాత్రం ఇప్పటికీ ఏమాత్రం దడుసుకోవడం లేదు. ఇక.. వైసీపీతో మాత్రం ఆయన బంధం తెగిపోయినట్టే. రఘురామ లాంటి నాయకుడి వల్ల వైసీపీకి ఎప్పటికీ మాయని మచ్చే. కానీ.. ఆయనకు ఇప్పుడు ఫుల్లు పాపులారిటీ వచ్చేసింది. ఆయన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయిపోయారు.
YSRCP : రఘురామ ప్లేస్ ను భర్తీ చేయడం కోసం బాగానే కష్టపడుతున్న జగన్
వైసీపీతో రఘురామకు నూకలు చెల్లిపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం ప్రాంతంలో అంతే ఫేమ్ ఉన్న నాయకుడి కోసం వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు, రఘురామ పాపులారిటీని తగ్గించి.. వైసీపీ పాపులారిటీని పెంచేందుకు అక్కడ కత్తి లాంటి నేత కావాలి. ఆ నేత కోసమే సీఎం జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారట. అయితే.. అక్కడ టీడీపీ నేత కలువపూడి శివ అయితేనే బెటర్ అని భావిస్తున్నారట. అందుకే.. ఆయన్ను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట.
రఘురామ లోటును పూడ్చాలంటే.. ఈయనే కరెక్ట్ అని జగన్ కూడా భావిస్తున్నారట. ఎందుకంటే.. శివ.. రెండుసార్లు ఉండి నియోజకవర్గం నుంచి గెలిచారు. అలాగే.. గతంలో ఎంపీ ఎన్నికల్లో రఘురామపై పోటీ చేసి చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. నర్సాపురంలో రఘురామ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నేతల శివ కావడంతో.. శివను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నయట. శివ కూడా.. టీడీపీలో అసంతృప్తితోనే ఉన్నారని తెలుసుకొని.. వైసీపీలో ఆయన్ను చేర్చుకొని.. రఘురామ లేని లోటును పూడ్చబోతున్నారట జగన్.