YS Jagan : వైసీపీ సీనియర్ నేతలకు జగన్ బిగ్ షాక్?
YS Jagan : వైఎస్ జగన్.. ఏపీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను పర్ ఫెక్ట్ గా నిర్వర్తిస్తూనే.. వైఎస్సార్సీపీ పార్టీ అధినేతగా కూడా తన బాధ్యతలను అంతే శ్రద్ధతో నెరవేర్చుతున్నారు. ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. మరో వైపు పార్టీని బలోపేతం చేస్తున్నారు. నిజానికి సీఎం జగన్ కొంచెం రిజర్వ్ డ్ పర్సన్. ఎక్కువగా మాట్లాడరు. ఆయన మాట్లాడే తీరు గురించి వైసీపీ నేతలకు బాగా తెలుసు. తక్కువ మాట్లాడినా.. కంటెంట్ కరెక్ట్ గా ఎవరికి చేరాలో వారికి చేరుతుంది. అదే జగన్ లో ఉన్న గొప్ప గుణం. ఇటీవల తిరుపతి ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచినా సరే.. సీఎం జగన్ మాత్రం.. ఆ ఫలితాల విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారట. ఎందుకంటే.. అక్కడ భారీ మెజారిటీతో గెలవాలని జగన్ భావించారు కానీ.. వైసీపీనే గెలిచినా.. మెజారిటీ అంతగా రాలేదు.
తిరుపతి ఉపఎన్నికల్లో కొందరు వైసీపీ నేతలు అనుకున్నంత రీతిలో పనిచేయలేదనే అపవాదు కూడా ఉంది. దీంతో సీఎం జగన్ కొందరు సీనియర్ నేతలపై చాలా సీరియస్ గా ఉన్నారట. నిజానికి సీఎం జగన్ ఎక్కువగా యూత్ కే ప్రాధాన్యత ఇస్తుంటారు. దానికి ఉదాహరణే ఆయన ఏర్పాటు చేసిన మంత్రివర్గం. తన మంత్రివర్గంలో ఎక్కువ శాతం యూత్ కు చోటు దక్కింది. కొందరు సీనియర్లను జగన్ కావాలనే మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కను పెట్టారు.
YS Jagan : సీనియర్లను పక్కన పెట్టి.. యువ నేతలను ప్రశంసించిన జగన్
తిరుపతి ఉపఎన్నికల్లో ఎంపీగా గెలిచిన గురుమూర్తి తాజాగా చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులతో కలిసి సీఎం జగన్ ను కలిశారట. ఆ సమయంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఆ సమయంలో సీఎం జగన్.. సీనియర్ ఎమ్మ ల్యేలను పక్కన పెట్టి.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి.. తిరుపతి ఉపఎన్నికల్లో బాగా పనిచేశారని మెచ్చుకున్నారట. అలాగే.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు పవిత్రా రెడ్డి కూడా బాగా పనిచేశారని సీఎం జగన్ మెచ్చుకున్నారట. ఇలా.. యువ నేతలందరినీ సీఎం జగన్ పొగుడుతుండటం.. అసలు సీనియర్ నేతలను పట్టించుకోకపోవడంతో.. సీనియర్ నేతలకు అసలు సీన్ ఏంటో అర్థం అయిందట. సీఎం జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే భవిష్యత్తులో కూడా సీనియర్లను పక్కన పెట్టి.. యూత్ కే అవకాశాలు ఇస్తారని స్పష్టంగా అర్థం అవుతోంది.