YS Jagan : ఏంటీ .. వైఎస్‌ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూలిపోతుందా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Jagan : ఏంటీ .. వైఎస్‌ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూలిపోతుందా..?

YS Jagan : వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో బాగానే పటిష్ఠంగానే ఉంది. తొలిసారి ముఖ్యమంత్రగా బాధ్యతలు స్వీకరించినా.. బాగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు మాత్రమే పూర్తయింది. ఇంకా మూడేళ్ల పాటు వైఎస్ జగన్ అధికారంలో ఉంటారు. మరో మూడేళ్ల పాటు.. వైసీపీ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే.. కావాల్సిన దాని కంటే ఎక్కువ బలం ఉంది వైసీపీ పార్టీకి. టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుమని పది […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :4 June 2021,7:00 am

YS Jagan : వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో బాగానే పటిష్ఠంగానే ఉంది. తొలిసారి ముఖ్యమంత్రగా బాధ్యతలు స్వీకరించినా.. బాగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు మాత్రమే పూర్తయింది. ఇంకా మూడేళ్ల పాటు వైఎస్ జగన్ అధికారంలో ఉంటారు. మరో మూడేళ్ల పాటు.. వైసీపీ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే.. కావాల్సిన దాని కంటే ఎక్కువ బలం ఉంది వైసీపీ పార్టీకి. టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుమని పది మంది కూడా లేరు. ఏపీలో వైఎస్ జగన్ దే మరో మూడేళ్ల వరకు రాజ్యం అని అంతా అనుకుంటున్నారు కానీ.. ఏమో.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.

ap cm ys jagan mohan reddy ysrcp

ap cm ys jagan mohan reddy ysrcp

ఎందుకంటే.. వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బయట పన్నాగాలు జరుగుతున్నాయి.. అని వైసీపీ నేతలే బాహటంగా చెబుతున్నరు. నిజానికి.. వైసీపీ ప్రభుత్వం కూలే చాన్స్ ఉందా అసలు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొన్నిసార్లు దూకుడు ప్రదర్శించిన విషయం తెలిసిందే. అలాగే.. ఆయనపై ఉన్న అక్రమాస్తులు కూడా ఆయన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. న్యాయవ్యవస్థపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదనే ఆరోపణలు చేయడం అనేది నిజంగా డేరింగ్ అనే చెప్పుకోవాలి. ఇలా.. కొన్ని విషయాల్లో సీఎం జగన్ ప్రదర్శించిన దూకుడుతనాన్ని ఆసరాగా చేసుకొని.. ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పన్నాగాలు చేస్తున్నారు.. అనేది చాలారోజుల నుంచి ఉన్న టాకే.

YS Jagan : చంద్రబాబుకు ఆపని సాధ్యమేనా?

అయితే.. వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం ఇన్ని రోజులు టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగానే ప్రయత్నించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అడ్డం పెట్టుకొని చంద్రబాబు బాగానే గేమ్స్ ఆడే ప్రయత్నం చేశారు కానీ.. అది వర్కవుట్ కాలేదు. అక్రమాస్తుల కేసులో జగన్ కు వచ్చిన బెయిల్ ను కూడా రద్దు చేయాలంటూ రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అన్ని రకాలుగా సీఎం జగన్ ను ఇబ్బందులకు గురి చేసి.. ఒక వేళ జగన్ జైలుకు వెళితే.. ప్రభుత్వం కూలిపోతుంది కదా.

ap cm ys jagan mohan reddy ysrcp

ap cm ys jagan mohan reddy ysrcp

అది ప్రతిపక్ష పార్టీల ప్లాన్ అన్నమాట. ఏది ఏమైనా.. జగన్ పై విమర్శలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. అది చంద్రబాబు మెడకే చుట్టుకుంటోంది. ఏది ఏమైనా.. జగన్ ఒకవేళ జైలుకు వెళ్లినా కూడా వైసీపీ ప్రభుత్వానికి ఏం కాదని.. అప్పుడు జగన్ మీద ఇంకాస్త సానుభూతి పెరుగుతుంది తప్పితే తగ్గదని.. ప్రతిపక్షాలు ఎంత కష్టపడి.. వైసీపీ ప్రభుత్వాన్న కూలగొట్టాలన్నా.. అది సాధ్యం కాని పని అని.. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి అని.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టే మొనగాడే ఏపీలో లేడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?

ఇది కూడా చ‌ద‌వండి ==> YS Jagan : వైసీపీ సీనియర్ నేతలకు జగన్ బిగ్ షాక్?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏ క్ష‌ణ‌మైనా మూడు రాజ‌ధానులు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసిన బొత్స , విజ‌య‌సాయిరెడ్డి

ఇది కూడా చ‌ద‌వండి ==> మ‌ళ్లీ రాఘురామ‌కు ఆ పార్టీ నుంచి న‌ర‌సాపురం టికెట్ ఖాయం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆనంద‌య్య కంట్లో వేసే మందు రిపోర్ట్ వ‌చ్చింది.. సైడ్ ఎఫెక్ట్స్‌ లేవు కానీ..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది