అక్కడ వంశీని ఎదురించే మొనగాడు ఆ పార్టీలో ఉన్నాడా..?
TDP : తెలుగుదేశం పార్టీకి ఏపీలో ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను తిరగరాయడం ఎవ్వరి తరం కాదు. నిజానికి ఏపీకి, టీడీపీకి ఉన్న అనుబంధం కూడా అటువంటిది. తెలుగు ప్రజల కోసం.. తెలుగు జాతి సంరక్షణ కోసం.. తెలుగు జాతి అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ టీడీపీ. కానీ.. అవన్నీ ఒకప్పుడు.. సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు పార్టీ పరిస్థితి వేరు. అప్పటి పార్టీ వేరు.. ఇప్పటి పార్టీ వేరు. 2019 ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. 2019 ఎన్నికల సమయం వరకు అధికారంలో ఉన్నది ఈ పార్టీయేనా అన్న అనుమానం కూడా రాక మానదు. అంతలా పార్టీ బలహీనం అయిపోయింది. ఎక్కడికక్కడ చీలికలు వచ్చేశాయి.
ఏపీలోని మిగితా ప్రాంతాలన్నీ ఒక ఎత్తు అయితే.. కృష్ణా జిల్లా ఒక ఎత్తు. ఎందుకంటే.. కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోట. అలాగే.. గన్నవరం నియోజకవర్గం అయితే.. టీడీపీకి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అక్కడ ఎవరు నిలుచున్నా.. ఓట్లు పడేది మాత్రం టీడీపీకే. గతంలోనూ అక్కడ టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచి.. ఎన్నో పదవులను అలంకరించిన వాళ్లూ ఉన్నారు. చివరకు 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచే వల్లభనేని వంశీ గెలిచినా.. తర్వాత రెబల్ ఎమ్మెల్యేగా మారి.. పార్టీకి ఎదురు తిరిగారు వంశీ. దీంతో టీడీపీకి చుక్కెదురైంది. గన్నవరం అంటే టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఇప్పుడు అక్కడ నియోజకవర్గ ఇన్ చార్జ్ ను నియమించాలంటే సరైన నాయకుడు చంద్రబాబుకు దొరకడం లేదట. నిఖార్సయిన నాయకుడే లేడట.
TDP : అక్కడ బలమైన నాయకులే లేక.. వంశీతో ఢీకొట్టే నాయకుడు లేక..
వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీ చెంత చేరారు. ఆయన ఒక్కరే కాదు.. 2019 ఎన్నికల తర్వాత చాలామంది గన్నవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. దీంతో గన్నవరంలో టీడీపీ కంచుకోట బద్దలు అయిపోయింది. వంశీ వైసీపీకి మద్దతు ఇస్తుండటంతో.. గన్నవరాన్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు పడుతున్న తిప్పలు మామూలుగా లేవు. అసలు.. వంశీని దీటుగా ఎదుర్కునే నాయకుడే గన్నవరంలో లేకుండా పోయాడట. అక్కడ వైసీపీని ఢీకొట్టాలన్నా.. వంశీని ఢీకొట్టాలన్నా.. బలమైన నాయకుడు కావాలి. అక్కడా ఇక్కడా వెతకగా.. చంద్రబాబుకు బందరుకు చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కనిపించాడు. ఆయనకు గన్నవరం నియోజకవర్గం బాధ్యతలను చంద్రబాబు అప్పగించి చేతులు దులుపుకున్నారు కానీ.. అర్జునుడికి అక్కడ అంతగా పాపులారిటీ లేదని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంచుకోటగా ఉన్న గన్నవరం బద్దలు కావాల్సిందేనంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.