Guava vs orange | విటమిన్ C కోసం నారింజా? జామా? .. ఈ రెండింట్లో అసలు ఏది బెటర్?
Guava vs orange | విటమిన్ C అనేది శరీర ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని బలపరచడమే కాకుండా, చర్మ ఆరోగ్యం, ఎముకలు, జీర్ణ వ్యవస్థ ఇలా అనేక విషయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే విటమిన్ C కోసం చాలామంది నారింజను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ అదే విటమిన్ C గులాబీ జామలో నారింజ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు!

#image_title
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం:
పురుషులకు రోజుకు 90 mg విటమిన్ C అవసరం
మహిళలకు 75 mg అవసరం
100g గులాబీ జామలో ≈ 222 mg విటమిన్ C
100g నారింజలో ≈ 70 mg విటమిన్ C
అంటే, విటమిన్ C కోసం నారింజ కన్నా గులాబీ జామ మరింత శక్తివంతమైన పండు అన్నమాట.
గులాబీ జామ తినడం వల్ల లాభాలు:
విటమిన్ Cతో పాటు ఫోలేట్, విటమిన్ A, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది
సెల్ డెవలప్‌మెంట్‌కు సహాయపడే ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది
జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, కడుపు సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది
రక్తహీనత, అలసట, ఒత్తిడి వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది
నారింజ తినడం వల్ల లాభాలు:
విటమిన్ Cతో పాటు కాల్షియం, పొటాషియం, విటమిన్ B1 సమృద్ధిగా ఉంటుంది
ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు తక్కువ
బీటా-క్రిప్టో శాంటోనిన్ ద్వారా సెల్ డ్యామేజ్ నుంచి రక్షణ
రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది
వైద్య నిపుణుల సూచన ప్రకారం, నారింజ రసం కాకుండా పూర్తి పండును తినడమే ఉత్తమం.