Harish rao : ఇదేంటి.. హ‌రీశ్‌రావు ఈట‌ల కు స‌పోర్ట్ చేస్తున్నాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Harish rao : ఇదేంటి.. హ‌రీశ్‌రావు ఈట‌ల కు స‌పోర్ట్ చేస్తున్నాడా..?

 Authored By inesh | The Telugu News | Updated on :23 October 2021,5:20 pm

Harish rao : క‌రీంన‌గ‌ర్ : హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ గెలుపున‌కు రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప‌రోక్ష స‌హ‌కారం. అదేంటి అనుకుంటున్నారా? లేదా ఆ.. వాళ్లిద్ద‌రూ పాత స్నేహితులే అయ్యుండొచ్చులే అనుకుంటున్నారా? ఏమో మ‌రి.. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న హ‌రీశ్ ఫోటోలు ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు స‌రిగ్గా వారం రోజుల గ‌డువు మాత్ర‌మే మిగిలి ఉంది.

Harish rao New twist in huzurabad bypoll

Harish rao New twist in huzurabad bypoll

ఆయా రాజ‌కీయ పార్టీల వాడీవేడీ ప్ర‌చారం తారాస్థాయికి చేరింది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపు కోరుతూ ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు డ‌ప్పు వాయించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇదంతా కామ‌నే అంటారా. చాయ్ దుకాణానికి పోయి చాయ్‌ అమ్మ‌డం, ఇస్త్రీ షాపుకు పోయి బ‌ట్ట‌లు ఇస్త్రీ చేయ‌డం, మురికి వాడ‌ల‌కు పోయి చిన్న‌పిల్ల‌ల‌కు స్నానాలు చేయించ‌డం, తోపుడు బండ్ల‌వ‌ద్ద‌కు పోయి పండ్లు, కూర‌గాయలు అమ్మ‌డం, ధూం.. ధాం కార్య‌క్ర‌మంలో డ‌ప్పు వాయింపులు స‌హ‌జ‌మే అంటారా.. అవును.. అదంతా కామ‌నే.. కానీ హ‌రీశ్ డ‌ప్పు వాయింపు మాత్రం భిన్నం. ఎందుకంటారా.. క‌మ‌లం పువ్వు గుర్తుకే మ‌న ఓటు అని రాసి బీజేపీ గుర్తు స్ప‌ష్టంగా ఉన్న డ‌ప్పు చేబూని హ‌రీశ్ వాయించాడు.

Harish rao New twist in huzurabad bypoll

Harish rao New twist in huzurabad bypoll

హ‌రీశ్ మాత్ర‌మే కాదు టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌, చొప్ప‌దండి ఎమ్మెల్యే సుంకే ర‌విశంక‌ర్‌, తోటి అనుచరులంతా బీజేపీ డ‌ప్పులుబూనీ దండోరా చాటారు. ఈ ఫోటోలే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా, వాట్స‌ప్‌ల‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. హ‌రీశ్ మ‌ద్ద‌తు ఈట‌ల‌కేనా అంటూ జోకులు ప్ర‌చారం అవుతున్నాయి. అయితే బీజేపీ సోష‌ల్ మీడియా వింగ్ ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి బీజేపీ గుర్తుల‌తో ఉన్న డ‌ప్పుల‌ను ప్ర‌చారంలోకి తెచ్చిన‌ట్లు టీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

inesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది