Harish Rao : నిన్న ఈటల.. నేడు హరీశ్ రావు.. టార్గెట్ ఫిక్స్ చేసిన కేసీఆర్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Harish Rao : నిన్న ఈటల.. నేడు హరీశ్ రావు.. టార్గెట్ ఫిక్స్ చేసిన కేసీఆర్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 June 2021,6:24 pm

Harish Rao : హరీశ్ రావు.. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. అంతేనా.. సీఎం కేసీఆర్ కు స్వయానా మేనల్లుడు. అయినా కూడా ఆ మధ్య సీఎం కేసీఆర్.. హరీశ్ రావును పక్కన పెట్టారు. దానికి కారణాలు అనేకం కానీ.. అప్పట్లో హరీశ్ రావు.. పార్టీలో యాక్టివ్ గా లేరు. మొదటి సారి మంత్రవర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత ఏమైందో కానీ.. మళ్లీ హరీశ్ రావుకు ఆర్థిక మంత్రత్వ శాఖను కట్టబెట్టారు కేసీఆర్. ఏది ఏమైనా.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు మధ్య కొన్ని విభేదాలు ఉన్నమాట వాస్తవం. అయితే.. అవి బయటపడటం లేదు. పడకుండా జాగ్రత్త పడుతున్నారు.

harish rao vs kcr telangana trs news

harish rao vs kcr telangana trs news

నిజానికి సీఎం కేసీఆర్ హరీశ్ రావు మీద ఫోకస్ ఎప్పుడో పెట్టారట. కాకపోతే.. ఈటలలా మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ డైరెక్ట్ గా బుక్ చేయలేరు. అలా చేస్తే.. పార్టీకి తీవ్ర నష్టం రావడంతో పాటు.. కుటుంబ సమస్యలు కూడా వస్తాయి. అందుకే సీఎం కేసీఆర్.. హరీశ్ రావు విషయంలో ఆచీతూచీ అడుగు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచాక.. హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ బాగా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ.. 2018 ఎన్నికల తర్వాత ఆ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. కేటీఆర్ కు ప్రాధాన్యత పెరిగింది.

Harish Rao : హరీశ్ రావుకు చెక్ పెట్టేందుకే హుజూరాబాద్ బాధ్యతలు?

ఈటల రాజేందర్ కు, సీఎం కేసీఆర్ కు ఎక్కడ చెడిందో తెలియదు కానీ.. ఆయనపై భూకబ్జా ఆరోపణలు రావడం, వెంటనే మంత్రి వర్గం నుంచి ఈటలను తొలగించడం అన్నీ ఫటాఫట్ జరిగిపోయాయి. అయితే.. హరీశ్ రావు విషయంలో కూడా సీఎం కేసీఆర్ అసంతృప్తితోనే ఉన్నారట. హరీశ్ రావును బీజేపీలోకి లాక్కోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు సీఎం కేసీఆర్ కు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. హరీశ్ రావు ఒకవేళ బీజేపీలో చేరితే.. బీజేపీకి అది బిగ్ ప్లస్ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుంది. అప్పటి నుంచి కేసీఆర్.. హరీశ్ రావుకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఏదో నామ్ కే వాస్తే మంత్రి పదవిని హరీశ్ రావు కు ఇచ్చారని.. ఈటల తర్వాత కేసీఆర్ నెక్స్ ట్ టార్గెట్ హరీశ్ రావేనంటున్నారు.

harish rao vs kcr telangana trs news

harish rao vs kcr telangana trs news

అందుకే.. హరీశ్ రావుకు ఉపఎన్నికల బాధ్యతలను కేసీఆర్ అప్పగిస్తున్నారట. దుబ్బాక ఉపఎన్నిక బాధ్యతను హరీశ్ రావుకే అప్పగించినా.. అక్కడ హరీశ్ రావుకు దెబ్బ పడింది. ఓడిపోయే చోట కావాలని హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించి.. దాన్ని హరీశ్ రావుపైకి నెట్టడమే కేసీఆర్ ప్లాన్ అట. అదే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో హరీశ్ రావును పక్కన పెట్టి.. కేసీఆరే ఏకంగా రెండు సార్లు అక్కడ సభ పెట్టి సాగర్ సీటును గెలిపించుకున్నారు. ఇక.. త్వరలో రాబోతున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో మాత్రం మరోసారి హరీశ్ రావుకే బాధ్యతలు అప్పగించనున్నారట కేసీఆర్. హుజూరాబాద్ అంటేనే ఈటల రాజేందర్ కంచుకోట. అక్కడ హరీశ్ ను దించి.. ఈటలకు బద్ధ శత్రువును చేయడంతో పాటు.. ఈటల అక్కడ గెలిస్తే.. హరీశ్ ను బాధ్యుడిని చేసి.. హరీశ్ ను ఇబ్బందుల్లో పెట్టడమే సీఎం కేసీఆర్ ప్లాన్ అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హుజూరాబాద్ ఓటమి నెపాన్ని హరీశ్ పై రుద్ది.. ఆయన్ను పార్టీలో ఇంకా ఇన్ యాక్టివ్ చేసే అవకాశాలు ఉన్నాయని.. ఈటల తర్వాత సీఎం కేసీఆర్ చెక్ పెట్టేది ఇంకెవరికో కాదు.. తన మేనల్లుడు హరీశ్ రావుకే అంటూ వార్తలు జోరుగా ఊపందుకుంటున్నాయి.

Harish Rao : ఈటల పార్టీకి రాజీనామా చేస్తే.. వచ్చిన నష్టమేమీ లేదు

harish rao vs kcr telangana trs news

harish rao vs kcr telangana trs news

ఇదిలా ఉండగా.. మంత్రి హరీశ్ రావు.. ఈటల పార్టీ వీడే విషయంపై స్పందించారు. ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినా.. పార్టీకి వీసమెత్తు కూడా నష్టం లేదని స్పష్టం చేశారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు. అధిష్ఠానం తనకు ఏ పని అప్పగించినా చేయడం తన విధి, బాధ్యత అని.. సీఎం కేసీఆర్ తన గురువు అంటూ హరీశ్ చెప్పడం గమనార్హం. కేసీఆర్ నాకు తండ్రితో సమానం. ఆయనే నాకు మార్గదర్శి.. అంటూ హరీశ్ రావు కేసీఆర్ ను పొగడ్తల్లో ముంచెత్తారు.

ఇది కూడా చ‌ద‌వండి ==>  ఎంత ఆకలేస్తే మాత్రం.. అంత పెద్ద గుడ్డును మింగేస్తుందా? ఈ పాము తిప్పలు మీరే చూడండి..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది