PM Modi : మోడీ అందరికీ ఇళ్ళు ఇస్తున్నాడు .. మీ అర్హత ఇలా చెక్ చేసుకోండి..!
PM Modi : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాల కోసం చాలా పథకాలను తీసుకొచ్చింది. పేదలకు ఉండటానికి ఇల్లు, పని చేసుకోవడానికి పని కల్పించడం, రేషన్ బియ్యం, ఇతర సరుకులు, పింఛన్ ఇలా పలు రకాలుగా పేదలకు అండగా నిలుస్తోంది ప్రభుత్వం. అయితే.. ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయపడుతోంది ప్రభుత్వం.
ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకోవడానికి పీఎం ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం.ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రజలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకుంటే అర్హత ఉంటే ఆ పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. సంవత్సరానికి మూడు లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్లు పీఎం ఆవాస్ యోజన అనే పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
PM Modi : రెండున్నర లక్షల సాయం అందించనున్న ప్రభుత్వం
ఈ పథకం కింద అర్హులు అయిన వాళ్లకు రూ.2.50 లక్షల సాయం అందిస్తారు. అయితే.. ఈ సబ్సిడీ మూడు విడుతల్లో విడుదల అవుతుంది. మొదటి విడతగా రూ.50 వేలు, రెండో విడతగా రూ.1.50 లక్షలు, మూడో విడతగా మరో రూ.50 వేలు విడుదల చేస్తారు. రెండున్నర లక్షల్లో ఒక లక్ష మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు వస్తాయి. దీనికి మీరు అర్హులు అయితే.. వెంటనే ఈ పథకం కింద అప్లయి చేసుకొని ఇల్లు కట్టేసుకోండి.