Diabetes : మీకు షుగర్ ఉందా? వెంటనే కొబ్బరి నూనె వాడండి… కొబ్బరి నూనె వల్ల షుగర్ ఉన్న వాళ్లకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Diabetes : షుగర్, డయాబెటిస్, చక్కెర వ్యాధి… పేరు ఏదైనా… ఈ వ్యాధి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. షుగర్ అంటేనే జనాలు భయపడిపోతున్నారు. వామ్మో… ఏం తింటే షుగర్ వస్తుందో అని అనుక్షణం టెన్షన్ పడుతున్నారు. మన దేశంలో అయితే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండే అన్నాన్ని తినడం వల్ల చాలామంది షుగర్ ను కొని తెచ్చుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ… పీచు పదార్థం తక్కువ.. ఇలాంటి ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా చిన్న వయసులోనే షుగర్ వ్యాధికి గురవుతున్నారు. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే… ఇక జీవన విధానాన్నే మార్చేసుకోవాలి. ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి.
షుగర్ వచ్చిందని తెలియగానే… కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకూడదు.. అలాగే గ్లూకోజ్ ఎక్కువగా ఉండే పదార్థాలను కూడా తినకూడదు. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తింటే మంచిది. షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. అయితే.. షుగర్ ఉన్న వాళ్లు వంట నూనెల వాడకంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలట. ఎందుకంటే.. మామూలుగా బయట మార్కెట్ లో దొరికే పల్లి నూనె, సన్ ఫ్లవర్ నూనె, కాటన్ నూనె, పామాయిల్ నూనె.. వీటిలో ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి. అది కూడా చెడు కొలెస్టరాల్. దీని వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి… షుగర్ ఉన్న వాళ్లు ఈ వంట నూనెల కన్నా.. కొబ్బరి నూనెను వంటనూనెగా వాడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Diabetes : కొబ్బరి నూనె వాడటం వల్ల షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు
మన దేశంలోని కేరళ రాష్ట్రంలో ఎక్కువ మంది కొబ్బరి నూనెతోనే వంటలు చేసుకుంటారు. కొబ్బరి నూనెతో వంట చేయడం వల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ నూనెతో వంట చేసుకొని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్టరాల్ ను అది తగ్గిస్తుంది. అలాగే మన శరీరానికి హాని చేసే ట్రైగ్లిజరైడ్లను కూడా కొబ్బరి నూనె తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంతో శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ ఈ కొబ్బరి నూనె ద్వారానే వస్తుంది. దీంతో షుగర్ లేవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.