Bathua | శీతాకాలంలో ఆరోగ్యానికి వరగా బతువా ఆకుకూర..! మలబద్ధకం నుంచి మధుమేహం వరకూ ..
Bathua | శీతాకాలం వచ్చేసింది. ఈ సమయంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి శరీరానికి అవసరమైన పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ సమయంలో లభించే ఆకుకూరలు శరీరానికి బలం ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది బతువా ఆకుకూర. రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకుంటే శీతాకాలం స్పెషల్ అనారోగ్య సమస్యలు నుంచి దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

#image_title
బతువా ఆకుకూర తీసుకోవడంవల్ల లాభాలు:
1. మలబద్ధకం సమస్యకు చెక్
బతువాలో ఉండే అధిక ఫైబర్, నీరు జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచుతాయి. ఇది మలబద్ధకంతో బాధపడే వారికి నేచురల్ రెమెడీలా పనిచేస్తుంది.
2. బరువు తగ్గాలనుకుంటున్న వారికి బెస్ట్
తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉన్న బతువా ఆకుకూర తినడం వల్ల శరీరానికి తక్కువ కాలరీలే లభిస్తాయి. పైగా ఇది కడుపునిండిన ఫీలింగ్‌ను కలిగించి, అధికాహారాన్ని నియంత్రిస్తుంది.
3. మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది
బతువా ఆకుకూర రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు దీనిని ఆహారంలో చేర్చుకోవచ్చు.
4. జుట్టు ఆరోగ్యానికి ఉపయోగకరం
బతువాలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ A, C వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, బలమైన జుట్టును పెంచడంలో సహాయపడతాయి.
5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో వాపు, జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న సమస్యల్ని దూరంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.