Raisin Curd : కిస్ మిస్, పెరుగును ఇలా కలిపి తింటే కలిగే లాభాలు తెలిస్తే వెంటనే తినేస్తారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raisin Curd : కిస్ మిస్, పెరుగును ఇలా కలిపి తింటే కలిగే లాభాలు తెలిస్తే వెంటనే తినేస్తారు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 April 2021,8:15 pm

Raisin Curd : ప్రస్తుతం ఎండాకాలం సీజన్. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి… శరీరంలో వేడిని తగ్గించే ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే శరీరంలో వేడి ఎక్కువై లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే… ఎండాకాలం లైఫ్ స్టయిల్ మొత్తం మార్చుకోవాలి. ఫుడ్ అలవాట్లను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఎండాకాలంలో డ్రై ఉండే ఆహారం అస్సలు పోదు. ఎక్కువగా లిక్విడ్ ఫుడ్, పండ్లు లాంటివే ఎక్కువగా తినాలనిపిస్తుంది. అయితే… వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు ఒక చక్కటి ఫుడ్ ఉంది. ఇది చాలామందికి తెలియదు. చాలా సింపుల్ గా తయారు చేసుకున్న ఐటెమ్ ఇది. దీన్ని కనుక వేసవిలో క్రమం తప్పకుండా తీసుకుంటే.. శరీరంలోని వేడి తగ్గడంతో పాటు…. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.

health benefits of having curd with raisins

health benefits of having curd with raisins

అదే పెరుగు, కిస్ మిస్ తో చేసిన రెసిపీ. పెరుగు గురించి తెలిసిందే. పెరుగు ఎంతో చలువ. అలాగే… కిస్ మిస్ తెలుసు కదా. అది డ్రై ఫ్రూట్. దాన్నే మనం ఎండు ద్రాక్ష అని కూడా అంటాం. దాంట్లో ఉండే పోషక విలువలు మరే డ్రై ఫ్రూట్ లో ఉండవు. విటమిన్ ఏ, సీ, ఈ, బీ2, బీ 12… ఇంకా ఫొలేట్ యాసిడ్, కెరోటినాయిడ్స్ అన్నీ ఉంటాయి. అందుకే… కిస్ మిస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుప్పెడు కిస్ మిస్ లను తింటేనే ఇన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందుతాయి. అలాగే… కిస్ మిస్ లో ఉండే మినరల్స్ శరీరంలోకి ఎటువంటి వైరస్ లు రాకుండా కాపాడుతాయి. అదే పెరుగుతో కిస్ మిస్ ను కలిపి ఒక రెసిపీని తయారు చేస్తే ఇంకెంత ప్రొటీన్స్ మన శరీరానికి అందుతాయి. అందుకే… వేసవిలో ఇటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

Raisin Curd : పెరుగు, కిస్ మిస్ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలంటే?

దీని కోసం కొన్ని పాలను తీసుకొని వాటిని వేడి చేసి కాసేపు పక్కన పెట్టి… గోరు వెచ్చగా పాలు మారాక… అందులో కాసిన్ని కిస్ మిస్ లను వేయాలి. ఆ తర్వాత అందులో కొంచెం పెరుగు కలిపి కాసేపు పక్కన పెట్టాలి. కొంత సమయం తర్వాత చూస్తే… పాలు కూడా పెరుగుగా మారుతాయి. అంటే… ఇంట్లో పాలు తోడేసినట్టే. కాకపోతే… అందులో కిస్ మిస్ కలుపుతున్నాం అంతే. పెరుగులా ఆ మిశ్రమం గట్టిపడ్డాక…. దాన్ని స్పూన్ తో తినేయడమే. క్రమం తప్పకుండా… ఈ మిశ్రమాన్ని తింటే… శరీరంలోని వేడి తగ్గడంతో పాటు… ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది