Diabetes : షుగర్ ఉన్నవాళ్లు బెండకాయ తినొచ్చా? తింటే ఏమౌతుంది?
Diabetes : అరేయ్.. బెండకాయ కూర తినరా? లెక్కలు మంచిగా వస్తాయి.. అని చిన్నప్పుడు మనం వద్దన్నా కూడా నోట్లో కుక్కి మరీ తినిపించేవారు బెండకాయ కూరను. నిజానికి బెండకాయ కూర తింటే లెక్కలు రావు. అది అబద్ధం. కాకపోతే.. బెండకాయ కూర తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం కలుగుతాయి. అందుకే కాబోలు.. బెండకాయ కూర తింటే లెక్కలు వస్తాయని అబద్ధం చెప్పినట్టున్నారు. అలా అయినా తింటారని. ఎందుకంటే.. బెండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరే కూరగాయ వల్ల కలగదు. మార్కెట్ కు వెళ్తే.. ఖచ్చితంగా బెండకాయలను తీసుకోవాల్సిందే.
అయితే.. చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే.. మధుమేహం వ్యాధితో బాధపడేవాళ్లు.. బెండకాయలను తీసుకోవచ్చా? లేదా? వాళ్లు బెండకాయలను తింటే ఏమౌతుంది.. అనే డౌట్లు చాలా వస్తుంటాయి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు బెండకాయ కూర తింటే.. షుగర్ అదుపులో ఉంటుందా? తింటే ఎలా తినాలి? తింటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Diabetes : డయాబెటిస్ ఉన్నవాళ్లు నిరభ్యంతరంగా బెండకాయను తినొచ్చు
నిజానికి.. షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేయడానికే కొన్ని దేశాల్లో బెండకాయను తింటారట. ఆ విషయం మనకు తెలియదు. ఎందుకంటే.. రక్తంలో ఉండే చక్కెర శాతాన్ని బెండకాయ తగ్గిస్తుందట. దీంట్లో పుష్కలంగా విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అలాగే.. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. జీవక్రియను కూడా ఇది మెరుగు పరుస్తుంది. అందుకే.. డయాబెటిస్ ఉన్నవాళ్లు బెండకాయలను ఎక్కువగా తీసుకోవాలి. షుగర్ ను కంట్రోల్ లో ఉంచడంతో పాటు.. శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బతినకుండా బెండకాయ చక్కగా పనిచేస్తుంది.
బెండకాయ గింజలు, తొక్కలో షుగర్ ను కంట్రోల్ చేసే కారకాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. ఊబకాయం సమస్యను దూరం చేస్తాయి. అయితే.. బెండకాయను చాలామంది వేపుడుగా చేసుకొని తింటుంటారు. అలా తినకూడదు. బెండకాయను ఉడకబెట్టి తినాలి. నూనెలో వేయించి తింటే.. అందులో ఉండే పోషకాలు శరీరానికి అందవు. బెండకాయను తక్కువ నూనె వేసి కూరలాగా వండుకొని తినండి. లేదంటే.. బెండకాయను పైన భాగం, కింద భాగం కట్ చేసి.. వాటిని ఓ గిన్నెలో నానబెట్టండి. ఉదయం బెండకాయలను నానబెట్టిన నీటిని తాగేస్తే మంచి లాభాలు ఉంటాయి.
ఇది కూడా చదవండి ==> ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగుతున్నారా? అసలు.. ఏ పాలు మంచివో తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి ==> ఉదయం అల్పాహారంగా దీన్ని తింటే.. ప్రాణాలకే ప్రమాదం..!
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండితో చేసిన రోటీలను ఈ సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు తినకూడదు
ఇది కూడా చదవండి ==> షుగర్ పేషెంట్లు కోడిగుడ్లు తింటే ఏమౌతుంది? షుగర్ ఉన్నవాళ్లు అసలు ఎగ్స్ తినొచ్చా? తినకూడదా?