Health Tips : గాఢ నిద్రలోకి వెళ్తే ఆ వ్యాధిని అరికట్టొచ్చట?
Health Tips : మనిషికే కాదు.. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి నిద్ర అనేది చాలా అవసరం. నిద్ర లేకపోతే ఏ పని చేయలేం. నీరసంగా ఉంటుంది. నిద్ర సరిగ్గా ఉంటేనే మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆ రోజు పనులన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. లేదంటే అంతే.. చిరాకు పెరుగుతుంది.. ఆరోగ్య సమస్యలు, తలనొప్పి.. ఇలా వందరకాల సమస్యలు చుట్టుముట్టుతాయి. అందుకే నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. ఈ జనరేషన్ లో నిద్ర గురించి మాట్లాడితే కష్టమే. ఈ జనరేషన్ వాళ్లకు నిద్ర కరువే. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్లు రావడం.. రాత్రిళ్లు నిద్రపోకుండా.. సెల్ ఫోన్లలో గంటల తరబడి అలాగే సోషల్ మీడియాలోనే ఉండటం… వీటన్నింటి వల్ల నిద్ర కరువైపోతోంది.
అయితే.. హాయిగా నిద్రపోవడం వల్ల ఒంటికి మంచిది అని విన్నాం కానీ.. అసలు నిద్ర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips : గాఢ నిద్ర వల్ల మెదడుకు సంబంధించిన ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు
గాఢ నిద్ర వల్ల మెదడుకు సంబంధించిన ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చట. ఇటీవల వెల్లడైన ఓ స్టడీ ప్రకారం.. గాఢ నిద్రలోకి పోయే వారిలో బ్రెయిన్ లో వచ్చే న్యూరోడీజనరేటివ్.. అనే సమస్య నుంచి తప్పించుకోవచ్చట. దాన్ని అరికట్టగలిగితే.. మెదడుకు వచ్చే ఎన్నో రోగాలు మటుమాయం అయినట్టే. మెదడులో చేరే విషపూరిత వ్యర్థాల వల్ల మెదడుకు న్యూరోడీజెనరేటివ్ వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే డీప్ స్లీప్ ఖచ్చితంగా కావాలి. డీప్ స్లీప్ వల్ల.. విషపూరిత వ్యర్థాలు మెదడును దరిచేరవు.
మనిషి గాఢ నిద్రలోకి వెళ్లగానే బ్రెయిన్ లో ఉన్న విషపూరితమైన చెత్తను ఏరేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మామూలుగా మనిషి మెళకువతో ఉన్నప్పుడు కూడా బ్రెయిన్ లో ఉన్న చెత్త బయటికి వెళ్లినప్పటికీ.. పూర్తిస్థాయిలో నాశనం కాదు. అదే.. మనిషి ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్తాడో అప్పుడు మాత్రమే బ్రెయిన్ లో ఉన్న పూర్తి చెత్త బయటికి పోతుంది.