Health Tips : అమ్మమ్మ చేతి హెయిర్ సీరం.. పడుకున్నప్పుడే జుట్టును పెంచేస్తుందట! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : అమ్మమ్మ చేతి హెయిర్ సీరం.. పడుకున్నప్పుడే జుట్టును పెంచేస్తుందట!

 Authored By pavan | The Telugu News | Updated on :22 May 2022,7:40 am

Health Tips : మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అయితే వేలకు వేలు డబ్బులు ఖర్చు చేసి ప్రత్యేకమైన హెయిర్ సీరంలు, డైలు, షాంపూలూ, నూనెలు, స్ప్రేలు ఎన్ని వాడినా సమస్యను తగ్గించుకోలేకపోతున్నారా… అయితే ఈ చిట్కాను పాటించి చూడండి. కచ్చితంగా కొద్ది కాలంలోనే అందమైన, పొడవైన జుట్టును మీ సొంతం చేస్కుంటారు. అయితే ముందుగా దీని కోసం రెండు స్పూన్ల బియ్యాన్ని తీసుకోవాలి. వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత నాలుగు లీటర్ల నీటిలో నానబెట్టాలి. వీటని కనీసం రెండు గంటల పాటు నానబెట్టి తర్వాత ఆర బెట్టుకోవాలి. ఇందుకోసం ముందుగా మనం స్టీల్ బౌల్ లేదా ఐరన్ ప్యాన్ తీసుకోవాలి. నాన్ స్టిక్ గిన్నెలు అస్సలే వాడకూడదు. వాటి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ.

how to prepare hair serum for long hair

how to prepare hair serum for long hair

అయితే ఇందులో… ముందుగా నీళ్లు పోసి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న మందార ఆకులను వేస్కోవాలి. అలాగే రేఖ మందార పూలను తీస్కొని నీటిలో వేయాలి. మందార పూలు, ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య రమైన ప్రయోజనాలను కల్గి ఉంటాయి. ఇవి బాగా మరిగి పూలు, మందార ఆకులు యొక్క గుణాలు నీటిలో దిగిన తర్వాత మంట ఆపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నీటిని వడ కట్టి ఒఖ స్ప్రే బాటిల్ లో వేస్కోవాలి. ఇంక చిట్కా కోసం ఒక ఉల్లిపాయ తీస్కొని బాగా తురమాలి. తర్వాత ఈ పేస్టును వడకట్టి రసాన్ని తీస్కోవాలి. దీనిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలుపుకోవాలి. ఇది జుట్టును డ్రై అవ్వకుండా కాపాడుతుంది. తర్వాత ఇంతకు ముందు తయారు చేసుకున్న బియ్యం నీటిని ఒఖ మూడు స్పూన్లు కలుపుకోవాలి. ఉల్లిపాయ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి.

బియ్యం మిశ్రమాన్ని మిగతా జుట్టుకు స్ప్రే చేయడం ద్వారా అప్లై చేయాలి. తర్వాత జుట్టును బాగా మసాజ్ చేసి ముడి వేసుకోవాలి. రెండు గంటల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తలకు అఫ్లై చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు బలంగా మారుతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు సమస్యలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా బియ్యం నీటిలో ఉండే ప్రోటీన్లు జుట్టు పెరుగుదలను చాలా బాగా పెంచుతాయి. మందార పువ్వులు యొక్క ఔషధ గుణాల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. జుట్టు సంరక్షణలో భాగంగా మందార ఆకులను పేస్టును జుట్టుకు ప్యాక్ లా అప్లై చేస్తూ ఉంటారు. ఈ సహజమైన చిట్కాలు ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది