Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి చిన్న సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువ రోజులు కొనసాగుతాయి. యాంటీబయాటిక్స్ వంటి మందులను తరచుగా వాడటం శరీరానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఆయుర్వేదం సూచించే ఇంటి చిట్కాలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి.
#image_title
రోగనిరోధక శక్తిని పెంచే నేచురల్ జ్యూస్
ఈ చిట్కా రుచికరంగానే కాకుండా, దగ్గు–జలుబు నుంచి ఉపశమనం కలిగించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా పిల్లలకు కూడా ఇది ఇష్టంగా తాగించేలా ఉంటుంది.
తయారీకి అవసరమైన పదార్థాలు:
నారింజ పండు – 1
నల్ల మిరియాల పొడి – చిటికెడు
పసుపు – కొద్దిగా
తేనె – 1 టీ స్పూన్
తయారీ విధానం
ఒక నారింజ పండు తీసుకుని పైభాగాన్ని కోసి మూతలా ఉంచాలి.
ఆ నారింజను గ్యాస్ స్టౌవ్ మీద తక్కువ మంటపై ఉంచాలి.
రసం వెచ్చబడిన తర్వాత దానిలో నల్ల మిరియాల పొడి, పసుపు, తేనె వేసి బాగా కలపాలి.
ఆపై పైభాగాన్ని తిరిగి మూతలా పెట్టి కొద్దిసేపు ఉంచాలి.
కొంతసేపటికి నారింజ రసాన్ని తీసి చల్లారిన తర్వాత వాడాలి.
ఉపయోగం ఎలా?
వాతావరణం మారినప్పుడు దగ్గు, జలుబుతో బాధపడేవారికి ప్రతి ఒకటిన్నర గంటకు రెండు టీ స్పూన్లు ఈ రసం ఇవ్వాలి. తక్కువ సమయంలోనే ఉపశమనం లభిస్తుంది.