Heart Palpitations : మనిషికి అతి ముఖ్యమైన అవయవం గుండె. శరీరంలోని ఏ ఇతర అవయవం కొంత సేపు పనిచేయకున్నా.. మనిషి బతకగలుగుతాడు కానీ.. గుండె కొట్టుకోవడం ఒక్క సెకన్ పాటు ఆగిపోయినా అంతే.. మనిషి ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. మనిషికి గుండె కాయ అంతముఖ్యమైంది. అందుకే.. దాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్లు, నిపుణులు చెబుతుంటారు. గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. అయితే.. నేటి జనరేషన్ లో మారుతున్న జీవన శైలిలో గుండె జబ్బులు అనేవి కామన్ అయిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు వస్తున్నాయి. గుండె ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది. లేదంటే.. ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరూ ఊహించలేరు.
చాలామందికి గుండె సంబంధిత సమస్యలు ఏం లేకున్నా.. గుండె జబ్బులు లేకున్నా.. గుండె దడ వస్తుంటుంది. కొందరికైతే.. గుండె దడ రోజురోజుకూ పెరుగుతుంటుంది. అటువంటి సమయంలో ఏం చేయాలి? ఎందుకు గుండె దడ వస్తుంది? అనే విషయాలు చాలామందికి తెలియదు. గుండె దడ పెరుగుతున్నా కూడా కొందరు పట్టించుకోరు. లైట్ తీసుకుంటారు. కానీ.. అసలు గుండె దడ ఎందుకు వస్తుందో తెలుసా? గుండె దడ వస్తే ఏమౌతుందో తెలుసా?
గుండె దడ అంటే.. గుండె కొట్టుకోవాల్సిన వేగం కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది. ఆ సమయంలో గుండె దడగా అనిపిస్తుంది. గుండె దడ అనేది ఒత్తిడికి గురయినప్పుడు.. ఎక్కువగా ఆందోళనకు గురయినప్పుడు వస్తుంటుంది. అలాగే.. ఎక్కువగా పరిగెత్తినా.. ఎక్కువ వ్యాయామం చేసినా కూడా గుండె దడ వస్తుంటుంది. ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకున్నా కూడా గుండె దడ పెరుగుతుంటుంది. ఒక్కోసారి గుండె కొట్టుకోవాల్సిన వేగం కన్నా తక్కువగా కూడా కొట్టుకుంటుంది. ఒక్కోసారి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఆ సమయంలోనే గుండె దడ దడగా ఉంటుంది. దానికి కారణం.. హార్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ లో వచ్చే మార్పులు. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందట.అందుకే.. గుండె దడను ఆపాలంటే.. జీవన విధానంలో మార్పు రావాలి. ఒత్తిడిని జయించాలి. ఎక్కువగా యాంగ్జయిటీకి గురి కాకూడదు. మెడిటేషన్, యోగా ఎక్కువగా చేయాలి. కనీసం రోజుకు 20 నిమిషాల పాటు.. ఏదైనా వ్యాయామం చేయాలి. ఇలా.. క్రమం తప్పకుండా చేస్తూ ఉండే.. గుండె దడ సమస్యను తగ్గించుకోవచ్చు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.