Heart Palpitations : గుండె దడ ఎక్కువవుతోందా? అయితే.. మీకు ఈ సమస్యలు వచ్చేసినట్టే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heart Palpitations : గుండె దడ ఎక్కువవుతోందా? అయితే.. మీకు ఈ సమస్యలు వచ్చేసినట్టే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :15 June 2021,6:00 am

Heart Palpitations : మనిషికి అతి ముఖ్యమైన అవయవం గుండె. శరీరంలోని ఏ ఇతర అవయవం కొంత సేపు పనిచేయకున్నా.. మనిషి బతకగలుగుతాడు కానీ.. గుండె కొట్టుకోవడం ఒక్క సెకన్ పాటు ఆగిపోయినా అంతే.. మనిషి ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. మనిషికి గుండె కాయ అంతముఖ్యమైంది. అందుకే.. దాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్లు, నిపుణులు చెబుతుంటారు. గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. అయితే.. నేటి జనరేషన్ లో మారుతున్న జీవన శైలిలో గుండె జబ్బులు అనేవి కామన్ అయిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు వస్తున్నాయి. గుండె ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది. లేదంటే.. ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరూ ఊహించలేరు.

heart palpitations are symptoms of heart diseases

heart palpitations are symptoms of heart diseases

చాలామందికి గుండె సంబంధిత సమస్యలు ఏం లేకున్నా.. గుండె జబ్బులు లేకున్నా.. గుండె దడ వస్తుంటుంది. కొందరికైతే.. గుండె దడ రోజురోజుకూ పెరుగుతుంటుంది. అటువంటి సమయంలో ఏం చేయాలి? ఎందుకు గుండె దడ వస్తుంది? అనే విషయాలు చాలామందికి తెలియదు. గుండె దడ పెరుగుతున్నా కూడా కొందరు పట్టించుకోరు. లైట్ తీసుకుంటారు. కానీ.. అసలు గుండె దడ ఎందుకు వస్తుందో తెలుసా? గుండె దడ వస్తే ఏమౌతుందో తెలుసా?

Heart Palpitations : గుండె వేగంగా కొట్టుకోవడమే గుండె దడ

గుండె దడ అంటే.. గుండె కొట్టుకోవాల్సిన వేగం కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది. ఆ సమయంలో గుండె దడగా అనిపిస్తుంది. గుండె దడ అనేది ఒత్తిడికి గురయినప్పుడు.. ఎక్కువగా ఆందోళనకు గురయినప్పుడు వస్తుంటుంది. అలాగే.. ఎక్కువగా పరిగెత్తినా.. ఎక్కువ వ్యాయామం చేసినా కూడా గుండె దడ వస్తుంటుంది. ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకున్నా కూడా గుండె దడ పెరుగుతుంటుంది. ఒక్కోసారి గుండె కొట్టుకోవాల్సిన వేగం కన్నా తక్కువగా కూడా కొట్టుకుంటుంది. ఒక్కోసారి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఆ సమయంలోనే గుండె దడ దడగా ఉంటుంది. దానికి కారణం.. హార్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ లో వచ్చే మార్పులు. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందట.అందుకే.. గుండె దడను ఆపాలంటే.. జీవన విధానంలో మార్పు రావాలి. ఒత్తిడిని జయించాలి. ఎక్కువగా యాంగ్జయిటీకి గురి కాకూడదు. మెడిటేషన్, యోగా ఎక్కువగా చేయాలి. కనీసం రోజుకు 20 నిమిషాల పాటు.. ఏదైనా వ్యాయామం చేయాలి. ఇలా.. క్రమం తప్పకుండా చేస్తూ ఉండే.. గుండె దడ సమస్యను తగ్గించుకోవచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి==> Teff Flour : మీకు షుగర్ ఉందా? వెంటనే ఈ పిండి తినేయండి.. దెబ్బకు షుగర్ తగ్గాల్సిందే?

ఇది కూడా చ‌ద‌వండి==> మీకు గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే ప్ర‌తి రోజూ మూడు అర‌టి పండ్లు ఖ‌చ్చితంగా తినండి….!

ఇది కూడా చ‌ద‌వండి==> ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు ?

ఇది కూడా చ‌ద‌వండి==> మీకు తెలుసా… తిరుప‌తి కొండ‌పైన మీకు తెలియ‌ని విష‌యం మ‌రొక‌టి దాగి ఉంది..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది