వామ్మో… ఏంది ఈ జనం.. వాళ్ల క్యూ కట్టింది దేనికోసమో తెలిస్తే నోరెళ్లబెడతారు? వైరల్ వీడియో
Herbal Medicine : కరోనా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అన్ని జాగ్రత్తలు పాటించాలి. మాస్క్ వేసుకోవాలి.. మంచి ఆహారం తినాలి. కరోనా వచ్చిన వాళ్లకు దూరంగా ఉండాలి. గుంపులు గుంపులుగా తిరగకూడదు. ముఖ్యంగా అవసరం అయితేనే బయట అడుగు పెట్టాలి. అంతే కదా.. అంతకు మించి అంటే.. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి. కోవిషీల్డో లేక కోవాగ్జిన్ రెండిట్లో ఏదో ఒక వ్యాక్సిన్ ను రెండు డోసుల వేసుకుంటే కరోనా రాదు. అదేదో ట్యాబ్లెట్ కూడా వస్తోందట. అది కూడా వచ్చాక జ్వరం వస్తే ఎలా ట్యాబ్లెట్ వేసుకుంటామో.. కరోనా వచ్చినా కూడా అలాగే ట్యాబ్లెట్ వేసుకుంటే కరోనా పరార్ అనాల్సిందే. అయితే.. ఇవన్నీ ఇంగ్లీష్ మందులు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటే కనీసం 45 ఏళ్లు దాటి ఉండాలి. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయినా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లు ఎక్కడ చూసినా షార్టేజ్ గానే ఉన్నారు. తీవ్రంగా కరోనా వ్యాక్సిన్ కొరత ఉంది.
అందుకే కాబోలు.. ఓ వ్యక్తి ఏకంగా కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టాడు. భారతదేశంలో ఆయుర్వేదానికి మంచి నమ్మకం ఉంది. చాలామంది ఆయుర్వేదంతో ఎన్నో రోగాలను నయం చేశారు. భారతదేశంలో ఇంకా ఆయుర్వేదం బతికే ఉంది. ఇప్పటికీ ఇంగ్లీష్ మందులతో నయం కాని ఎన్నో జబ్బులను ఆయుర్వేద మందులతో తగ్గించారు. అందుకే ఆయుర్వేదాన్ని తరతరాల నుంచి ప్రజలు నమ్ముతూ వస్తున్నారు. అందుకే ఇప్పుడు కూడా నమ్మారు. ఇదిగో చూడండి.. క్యూ.. ఎలా లైన్ లో నిలుచున్నారో చూశారుగా. వాళ్లంతా కరోనా మందు కోసమే క్యూలో నిలబడ్డారు.
Herbal Medicine : ఆయుర్వేద మందుతో కరోనా తగ్గుతోందని ప్రచారం జరగడంతో?
సోషల్ మీడియాలో ఈ ఆయుర్వేద మందుతో కరోనా తగ్గుతుందని తెగ ప్రచారం సాగిందట. దీంతో.. ఇక చూసుకోండి.. ప్రజలు తండోపతండాలుగా అక్కడికి చేరుకొని ఆ మందు కోసం ఎగబడ్డారు. ఆయుర్వేద మందు కోసం.. కరోనా జాగ్రత్తలను మాత్రం గాలికి వదిలేసి.. ఏమాత్రం సోషల్ డిస్టెన్స్ పాటించకుండా జనం ఆయుర్వేద మందు కోసం ఎగబడ్డారు. ఇంతకీ ఎక్కడ ఇస్తున్నారు ఈ ఆయుర్వేద మందు అంటారా? ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అనే గ్రామంలోనే ఈ ఆయుర్వేద మందును ఉచితంగా అందిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి.. కరోనాకు ఆయుర్వేద మందును కనిపెట్టాడట. ఇప్పటి వరకు ఆ మందు వేసుకున్న వాళ్లెవ్వరికీ కరోనా రాలేదట. ఈ మందును రోజూ ఉదయమే పరిగడుపున వేరుశనగ అంత తీసుకొని మింగేయాలట. అలా కొన్ని రోజుల పాటు చేస్తే.. కరోనా అస్సలు రాదట. అయితే.. గర్భిణీలు మాత్రం ఈ మందు వేసుకోవద్దని ఆనంద్ చెబుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఈ ఆయుర్వేద మందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో… ప్రజలు అక్కడికి క్యూ కడుతున్నారు. నెల్లూరు జిల్లానే కాదు.. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అక్కడికి వెళ్లి కరోనా మందును తీసుకొని వెళ్తున్నారు.
Magic Drug Mania! People queue up at Anand’s house in #AndhraPradesh’s Krishnapatnam village, Nellore district. Anand sells a ‘herbal medicine’ which is “both preventive&curative” There is a dose for everyone, menstruating &pregnant women can’t take it. No action taken #COVID19 pic.twitter.com/KRCRdRoU3K
— Revathi (@revathitweets) May 17, 2021