BRS MLA : మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు ఊహించని ఝలక్

Advertisement

BRS MLA : ఇంకో మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లిస్టును ప్రకటించారు. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పగా.. ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లి హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నాడు. ఇక.. గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కూడా అనర్హుడిగా ప్రకటించింది హైకోర్టు.

Advertisement

తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాకిచ్చింది హైకోర్టు. ఆయనే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్. ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హైకోర్టులో కేసు వేయగా ఆ కేసును కొట్టేయాలంటూ గాదరి కిషోర్ పిటిషన్ వేయగా దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. గాదరి కిషోర్ వేసిన పిటిషన్ ను కొట్టేసింది. సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించాలని అద్దంకి దయాకర్ కు ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణను సెప్టెంబర్ 4 కు వాయిదా వేసింది కోర్టు.

Advertisement
High Court unexpected big shock for Another BRS MLA
High Court unexpected big shock for Another BRS MLA

BRS MLA : తుంగతుర్తి నుంచి మరోసారి బరిలో గాదరి కిషోర్

ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. అందులో తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గాదరి కిషోర్ కు మరోసారి అవకాశం దక్కింది. అయితే.. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం, అది కూడా ఎన్నికల వేళ ఇలా జరగడం ఒకరకంగా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అనే చెప్పుకోవాలి. త్వరలోనే గాదరి కిషోర్ పై కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అది గాదరికి మైనస్ అవనుంది. ఒకవేళ అనర్హత వేటు పడినా సుప్రీం కోర్టుకు వెళ్లి అనర్హత వేటుపై స్టే తెచ్చుకోవచ్చనే ప్లాన్ లో గాదరి ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వరుసగా అనర్హత వేటు పడటం బీఆర్ఎస్ కు మైనస్ అనే చెప్పుకోవాలి.

Advertisement
Advertisement