Tadipatri : తాడిపత్రిలో మళ్ళీ హైటెన్షన్, ఏం జరుగుతుంది…?
Tadipatri : 2019 ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రి లో వాతావరణం కాస్త వేడిగానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం నెలకొంది. రాజకీయంగా అధికార పార్టీ బలంగా ఉండటంతో నియోజకవర్గంలో వాతావరణం కాస్త హీట్ ఎక్కుతుంది. జేసి కుటుంబానికి కంచుకోట కావడంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.
తాడిపత్రిలో మరింత ముదురుతున్న స్టాచ్యూ ఫైట్ ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి పెరుగుతుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహాన్ని పెద్దారెడ్డి అనుచరులు ఆవిష్కరించారు. విగ్రహం ముసుగును తొలగించి పూలమాలలు వేసిన వైసిపి కార్యకర్తలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇక విగ్రహం విషయంలో మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే చురుగ్గా ఏర్పాట్లు సాగాయి. కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లిన మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ లు… మరో వివాదానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి తెరలేపారని విమర్శలు చేసారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.