House Construction : 8 గజాల్లో ఇల్లు.. 8 లక్షలు ఖర్చు.. రెండు ఫ్లోర్లు.. ఎక్కడో తెలుసా…వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

House Construction : 8 గజాల్లో ఇల్లు.. 8 లక్షలు ఖర్చు.. రెండు ఫ్లోర్లు.. ఎక్కడో తెలుసా…వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :10 December 2022,9:00 pm

House Construction : 8 గజాల్లో ఇల్లు కట్టడం అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అసలు 8 గజాల్లో ఇల్లు ఏంటి అని నోరెళ్లబెడుతున్నారు కదా. అవును.. 8 గజాల్లో ఇల్లు కట్టడం అనేది అసాధ్యం అంటారు కదా. కానీ.. అది అసాథ్యం కాదు.. సుసాధ్యం అని నిరుపించాడు ఓ వ్యక్తి. ఈ ఇల్లు తెలంగాణలోని హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న కుంట్లూరులో ఉంది. అవును.. అది కూడా ఒక ఫ్లోర్ కాదు..

రెండు ఫ్లోర్లలో ఈ ఇంటిని నిర్మించారు. కింద ఫ్లోర్ ను రియల్ ఎస్టేట్ కంపెనీకి కిరాయికి ఇచ్చి.. పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంది. కేవలం 8 గజాల్లో మేస్త్రీ అయిన ఓ వ్యక్తి తన సొంత జాగలో ఈ ఇంటిని నిర్మించుకున్నాడు. నిజానికి హైదరాబాద్ లో ప్లేస్ కు చాలా డిమాండ్ ఉంటుంది. ఒక్క గజం కూడా చాలా వాల్యూ ఉంటుంది. అందుకే.. వీళ్లు 8 గజాల్లో ఈ ఇంటిని నిర్మించారు. ముందు కాస్త వెడల్పుగానే ఉన్నా.. వెనక్కి వెళ్తున్నా కొద్దీ అది తక్కువ అయిపోయింది.

house constructed in 8 square yards in hyderabad

house constructed in 8 square yards in hyderabad

House Construction : 8 గజాల్లో ఇంటిని నిర్మించడానికి కారణం ఏంటి?

అసలు 8 గజాల్లో ఎందుకు ఇంటిని నిర్మించారని ఆ ఇంటి ఓనర్ ను అడిగితే కేవలం జాగ ఉంది కాబట్టి.. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని కట్టాడట. తనకు కుంట్లూరులో 8 గజాల స్థలం ఉందట. దాన్ని వేస్ట్ చేయకుండా కమర్షియల్ పర్పస్ లో ఆ ఇంటిని నిర్మించాడట. ముందు షటర్ కూడా వేసి దాన్ని కిరాయికి ఇచ్చాడు. మొత్తానికి 8 గజాల ఇంటిని నిర్మించి అక్కడ స్థానికంగా అందరి నోళ్లలో నానుతున్నాడు ఆ వ్యక్తి. స్వతహాగా మేస్త్రీ కావడంతో తనకు ఇళ్లు కట్టే అనుభవం ఉండటంతో ఆ అనుభవంతోనే ఇంటిని నిర్మించినట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది