House Construction : ఇల్లు కట్టుకునేందుకు రూ.4 లక్షల ఆర్థిక సాయం.. ప్రభుత్వం కీలక ప్రకటన
House Construction : పేదలకు ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌తో అనుసంధానం చేసి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించాలని సర్కారు నిర్ణయించింది.గృహ నిర్మాణ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఎన్నికల హామీని నెరవేరుస్తూ గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదవారి సొంతింటి కల […]
ప్రధానాంశాలు:
House Construction : ఇల్లు కట్టుకునేందుకు రూ.4 లక్షల ఆర్థిక సాయం.. ప్రభుత్వం కీలక ప్రకటన
House Construction : పేదలకు ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌తో అనుసంధానం చేసి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించాలని సర్కారు నిర్ణయించింది.గృహ నిర్మాణ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఎన్నికల హామీని నెరవేరుస్తూ గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదవారి సొంతింటి కల సాకారం చేసేలా ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించనున్నది.
రాష్ట్ర గృహనిర్మాణ పథకాన్ని పీఎమ్ఏవై( ప్రధానమంత్రి ఆవాస్ యోజన) అర్బన్-2.0 కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌తో అనుసంధానం చేసి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు అందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, ఏపీ ప్రభుత్వం వాటా 40 శాతం ఉండనుంది.
ఇటీవల మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఈ విషయంలో ఒక కీలక ప్రకటన చేశారు. పేద ప్రజల కోసం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టి, భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ పాలసీ ద్వారా భవన నిర్మాణంలో ఉన్న కూలీలకు, కార్మికులకు సరైన సహాయం అందించడంతో పాటు, పేదవారి ఇంటి నిర్మాణానికి కూడా ఉపయోగపడుతుందని మంత్రి వెల్లడించారు. పేదలకు ఇల్లు నిర్మించడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నం వారి జీవితాల్లో వెలుగులు తీసుకు వస్తుందని అంతా భావిస్తున్నారు.