Oxygen Levels : శరీరంలో ఆక్సిజన్ లేవల్స్ ఎంత ఉన్నాయో ఎలా చేక్ చేసుకోవాలి? తక్కువ ఉంటే ఏం చేయాలి?
Oxygen Levels : ప్రస్తుతం దేశమంతా ఎదుర్కొంటున్న సమస్య కరోనా మహమ్మారి. దీని వల్ల చాలామందికి శ్వాస అందడం లేదు. అంటే.. తమ శరీరంలోని ఆక్సిజన్ లేవల్స్ పడిపోతున్నాయి. ఆక్సిజల్ లేవల్స్ ఎప్పుడైతే పడిపోతాయో.. అప్పుడు శరీరానికి శ్వాస అందదు. అప్పుడు ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్ కావాల్సిందే. బయటి నుంచి మనిషికి ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. సడెన్ గా కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ లేవల్స్ పడిపోతుండటంతో.. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోతే.. శ్వాస తీసుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువ శాతం మంది ఇలాగే చనిపోతున్నారు.
అందుకే.. అసలు.. మనిషి శరీరంలో ఎంత ఆక్సిజన్ శాతం ఉండాలి. తక్కువ ఉంటే ఏం చేయాలి? అసలు.. ఆక్సిజన్ లేవల్స్ ను ఎలా కనుక్కోవాలి.. అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఉన్న ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకునేందుకు పల్స్ ఆక్సిమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించవచ్చు. అది చాలా చిన్నగానే ఉంటుంది. పెన్ డ్రైవ్ అంత సైజ్ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా దాన్ని తీసుకెళ్లొచ్చు. పల్స్ ఆక్సిమీటర్ ను చేతి వేలికి ధరిస్తే చాలు.. అది మన శరీరంలో ఎంత ఆక్సిజన్ శాతం ఉందో చెబుతుంది. ఒకవేళ మీకు ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువ ఉంటే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోవడం మంచిది.
Oxygen Levels : మనిషికి ఖచ్చితంగా 94 శాతం ఆక్సిజన్ లేవల్స్ ఉండాల్సిందే
మనిషికి శరీరంలో ఖచ్చితంగా 94 శాతం ఆక్సిజన్ లేవల్స్ ఉండాల్సిందే. లేదంటే.. శ్వాస అందదు. అలాగే… చాతి నొప్పి వస్తుంది. గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. ఒకవేళ సడెన్ గా ఆక్సిజన్ శాతం తగ్గితే.. ఆక్సిజన్ అందకపోతే ఏం చేయాలి? అంటే.. దాని కోసం మనం ప్రోనింగ్ చేయొచ్చు. ప్రోనింగ్ అంటే అది ఒక వ్యాయామం ప్రక్రియ. దాని కోసం జస్ట్ బోర్లా పడుకోవాలి. అంటే చాతికి, పొట్ట భాగానికి బరువు పడేలా.. బోర్లా పడుకొని.. శ్వాస తీసుకోవాలి. అలా ఓ 5 నిమిషాలు బోర్లా పడుకొని శ్వాస తీసుకుంటే.. శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. దీని వల్ల ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. అలాగే.. ఒక పక్కకు పడుకొని కూడా శ్వాస తీసుకోవచ్చు. దీని వల్ల కూడా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది.
Also Read : Proning : కరోనా సోకిందా? ఇంట్లోనే ఉంటూ ఆక్సిజన్ లేవల్స్ ను ఇలా పెంచుకోండి..!