Tea : ఎక్కువగా చాయ్ తాగుతున్నారా? చాయ్ ప్రియులు ముందు ఇది చదవండి.. లేదంటే ప్రాణాలకు ప్రమాదం
Tea : చాయ్.. చటక్కునా తాగరా భాయ్ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నిజానికి.. చాయ్ అనేది మనందరి జీవితంలో ఒక భాగం. పొద్దున లేవగానే కప్పు చాయ్ తాగాల్సిందే. అప్పుడే మనం యాక్టివ్ అవుతాం. ఉత్సాహం రావాలన్నా చాయ్ తాగాల్సిందే. పని ఒత్తిడి తగ్గాలన్నా చాయ్ తాగాల్సిందే. రోజుకు ఒకటి రెండు కప్పుల చాయ్ తాగితే పెద్ద సమస్య లేదు కానీ.. రోజుకు మూడు నాలుగు కప్పుల చాయ్ తాగే వాళ్లు మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ఎక్కువగా చాయ్ తాగితే మంచిది కాదట. నిజానికి చాయ్ తాగితే మంచిదే. కానీ.. అది ఎక్కువైతేనే ప్రమాదం. రోజుకు ఒక కప్పు.. లేదా రెండు కప్పులు తాగితే పెద్దగా వచ్చే సమస్యేమీ లేదు.

side effects of drinking tea health tips telugu
కానీ.. ఎక్కువగా చాయ్ తాగితేనే సమస్యలు వచ్చేది. ఎందుకంటే.. చాయ్ లో కెఫిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. అది శరీరానికి చాలా సమస్యలను తీసుకొస్తుంది. అందుకే.. రోజుకు ఒక కప్పు చాయ్ తాగితేనే బెటర్. కానీ.. కొందరికి చిన్నప్పటి నుంచి ఎక్కువగా చాయ్ తాగడం అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఇప్పుడు మానాలంటే కష్టం. కానీ.. ఎక్కువగా చాయ్ ని తాగడం వల్ల.. ఎన్ని అనర్థాలో కనీసం తెలుసుకోండి. ఆ తర్వాత అయినా చాయ్ ని ఎక్కువగా తాగడం తగ్గించొచ్చు.
Tea : చాయ్ ఎక్కువగా తాగితే రోగ నిరోధక శక్తి బలహీన పడుతుంది
ఒక కప్పు చాయ్ లో కనీసం 96 గ్రాముల కెఫిన్ ఉంటుంది. శరీరంలో కెఫిన్ ఎక్కువైతే… లోపల ఉత్పత్తయ్యే సిర్కాడియన్ అనే హార్మోన్ మీద ప్రభావం పడుతుంది. సిర్కాడియన్ ఎప్పుడూ బ్యాలెన్స్ తో ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఎక్కువగా చాయ్ తాగడం వల్ల.. సిర్కాడియన్ బ్యాలెన్స్ తప్పడంతో.. గుండె సమస్యలు వస్తాయి. అలాగే.. మానసిక సమస్యలు కూడా వస్తాయి. బరువు పెరుగుతారు. రోగ నిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది.

side effects of drinking tea health tips telugu
Tea : అధికంగా చాయ్ తాగితే.. గొంతు క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ
అలాగే.. కొందరు వేడిగా ఉన్న చాయ్ నే స్పీడ్ గా తాగేస్తుంటారు. అలా తాగితే.. గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వేడి వేడిగా ఉండే చాయ్ గొంతులోకి వెళ్లి.. అక్కడ గొంతును ఇన్ఫెక్షన్ కు గురి చేస్తుంది. దాని వల్ల.. గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మామూలుగా.. గొంతులో 100 డిగ్రీల కంటే ఎక్కువ వేడి ఉన్న పదార్థాలను పంపించకూడదు. కానీ.. వేడిగా ఉండే ఒక కప్పు టీ.. 150 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉంటుంది. అందుకే.. వేడి వేడి చాయ్ ని అలాగే తాగేస్తే అన్నవాహిక దెబ్బతింటుంది. తద్వారా గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

side effects of drinking tea health tips telugu
టీ ఎక్కువగా తాగితే.. రక్త హీనత సమస్య వస్తుంది. ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఐరన్ లోపం ఏర్పడితే.. చాలా సమస్యలు వస్తాయి. మామూలు టీ తో పాటు.. బ్లాక్ టీ, గ్రీన్ టీ కూడా ఆరోగ్యానికి అంత మంచివి కావు. అయితే.. వాటిని కూడా మితంగా తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు కానీ.. అమితంగా తీసుకుంటేనే అసలు సమస్య. అందుకే.. అది ఏ చాయ్ అయినా సరే.. రోజుకు పరిమితంగా తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.
ఇది కూడా చదవండి ==> రాత్రి సమయంలో కోన్ని చిట్కాలను పాటిస్తే.. అధిక బరువును వేగంగా తగించుకోవచ్చు?
ఇది కూడా చదవండి ==> నూనె, ఉప్పు ఎక్కువ వాడేవారు.. పండ్లు, మొలకలు తినలేని వారు.. ఇలా సింపుల్‌గా అదిక బరువు తగ్గొచ్చు..!
ఇది కూడా చదవండి ==> షుగర్ పేషెంట్లు ఎక్కువగా కొబ్బరి తింటే… ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> పంచదారను తినడం ఆపేసారా.. అయితే మీకు శరిరంలో ఈ మార్పులు వస్తాయి ?