Ghee | అసలైన నెయ్యా? కల్తీ నెయ్యా? ఈ పరీక్షలతో ఇట్టే తేల్చేయోచ్చు..!
Ghee |వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని దోసెడు నెయ్యి కలిపి తినడంలో ఉన్న రుచి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే ఆ ఆరోగ్యం, రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. కానీ మార్కెట్లో అమ్ముతున్న నెయ్యి విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మీరు కొనుగోలు చేసిన నెయ్యి నిజంగా స్వచ్ఛమైనదా? కల్తీయా? ఈ చిన్న టెస్టులు చేస్తే తేలిపోతుంది.

#image_title
1. అరచేతి పరీక్ష
ఒక చెంచా నెయ్యిని అరచేతిలో తీసుకుని నెమ్మదిగా రుద్దండి.
అది శరీర ఉష్ణోగ్రతకి స్పందించి కరిగిపోతే – స్వచ్ఛమైన నెయ్యి
కరిగిపోకుండా గట్టి పదార్థంగా ఉంటే – కల్తీ ఉన్న అవకాశం ఎక్కువ
2. షేక్ టెస్ట్ (చక్కెరతో)
పారదర్శక గ్లాస్ బాటిల్‌లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా చక్కెర వేసి బాగా షేక్ చేయండి
కొన్ని నిమిషాల తర్వాత బాటిల్ అడుగున ఎర్రటి చారలు కనిపిస్తే అది కల్తీ నెయ్యి అని అర్థం
3. అయోడిన్ టెస్ట్
కొద్దిగా నెయ్యిలో నాలుగు చుక్కల అయోడిన్ వేయండి
నెయ్యి రంగు నీలంగా మారితే – స్టార్చ్ కలిపిన నకిలీ నెయ్యిగా గుర్తించాలి
4. వాసన పరీక్ష
చేతికి కొద్దిగా నెయ్యి రాసి రుద్దండి. మృదువైన, సహజ నెయ్యి వాసన వస్తే – నిజమైన నెయ్యే. వాసన త్వరగా మాయమైతే – కల్తీ పదార్థాల మిశ్రమమై ఉండే అవకాశం ఉంది
5. వేడి చేసి ఫ్రిజ్‌లో పెట్టడం
నెయ్యిని కొద్దిగా వేడి చేసి ఫ్రిజ్‌లో ఉంచండి .ఒకే లేయర్‌గా గట్టిగా ఏర్పడితే స్వచ్ఛమైన నెయ్యి. రెండు వేర్వేరు పొరలుగా – మిష్రమైన నూనెలు కలిపిన కల్తీ నెయ్యిగా గుర్తించాలి
6. తెట్టు పరీక్ష
నెయ్యిని వేడి చేస్తే నూనెలా పారద్రోలుతూ కనిపించాలి. కరిగిన నెయ్యి లేత పసుపు లేదా తెల్లగా ఉంటే
అది కూడా కల్తీకి సంకేతం