Women Empowerment : చేపలు పట్టే ఈ మహిళలు.. బీచ్ రెస్టారెంట్ ను పెట్టి నెలకు 50 వేలు సంపాదిస్తున్నారు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Women Empowerment : చేపలు పట్టే ఈ మహిళలు.. బీచ్ రెస్టారెంట్ ను పెట్టి నెలకు 50 వేలు సంపాదిస్తున్నారు

Women Empowerment ఆకాశంలో సగం .. అన్నింటా మనం .. అంటూ మహిళలు ప్రతి రంగంలోనూ తమదైన శైలిలో విజయాలు సాధిస్తూనే ఉన్నారు. దీనికి నిలువుటద్దంలా తమిళనాడు పూంపుహార్ గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకార మహిళలు నిలుస్తున్నారు.. ఆర్థిక సమస్యల్ని అధిగమించాలంటే, నడుం బిగించాల్సిందేనన్న ఓ మహిళ ముందడుగు .. మరో నలుగురికి జీవనాధారంగా మారింది. కేవలం 150 రూపాయలతో ఆరంభమైన ఆ అడుగు .. ఇప్పుడు ఏకంగా 50 వేలు పొందే స్థాయికి చేరింది. ఎండు […]

 Authored By sukanya | The Telugu News | Updated on :14 July 2021,7:06 pm

Women Empowerment ఆకాశంలో సగం .. అన్నింటా మనం .. అంటూ మహిళలు ప్రతి రంగంలోనూ తమదైన శైలిలో విజయాలు సాధిస్తూనే ఉన్నారు. దీనికి నిలువుటద్దంలా తమిళనాడు పూంపుహార్ గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకార మహిళలు నిలుస్తున్నారు.. ఆర్థిక సమస్యల్ని అధిగమించాలంటే, నడుం బిగించాల్సిందేనన్న ఓ మహిళ ముందడుగు .. మరో నలుగురికి జీవనాధారంగా మారింది. కేవలం 150 రూపాయలతో ఆరంభమైన ఆ అడుగు .. ఇప్పుడు ఏకంగా 50 వేలు పొందే స్థాయికి చేరింది. ఎండు చేపలు అమ్ముకుంటూ, తన భర్త చేపలవేటపైనే ఆధారపడి నానా అగచాట్లు పడిన స్టెల్లా గ్రేసీ దృష్టి క్యాటరింగ్ రంగంపై పడింది. చేపలు దొరక్కపోయినా, పెద్దగా ధర రాకపోయినా, ఆరోజు పస్తులుండాల్సిన పరిస్థితి .. దీనికితోడు పిల్లల చదువుల ఖర్చు ఉండడంతో, ఏదైనా చేయాలన్న ఆలోచన .. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ లో పని చేసిన కృష్ణన్ అనే వ్యక్తి సహకారంతో ఓ రూపు దాల్చింది. దీనికి తన ఒక్కదానివల్లే కాదన్న ఆలోచనతో తనతో పాటే ఎండు చేపలు అమ్ముకునే మరో 10 మహిళల్ని సంప్రదించింది. అందులోంచి ఓ నలుగురు కలిసిరావడంతో, ఏ వ్యాపారం చేయలనే విషయంలో కృష్ణన్ సహాయ సహకారాల్ని తీసుకుంది.

women empowerment Beach Restaurant Eran 50000 monthly

women empowerment Beach Restaurant Eran 50000 monthly

ఐక్యతతోనే .. women empowerment

వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, ఆర్థికంగా స్వతంత్రంగా మారాలన్నా మీరంతా కలిసి ఉండాలని ఆయన పదే పదే చెప్పేవారని, అందుకే ఇప్పుడు నెలకు పది వేలు ఆదాయం పొందగలుగుతున్నామని స్టెల్లా చెబుతోంది. సముద్ర ప్రాంతం కావడం, పక్కనే నౌకాశ్రయం ఉండడం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో తినడానికి ఏమీ దొరకని పరిస్థితిని అర్థం చేసుకుని, హోటల్ పెట్టేందుకు వీరంతా సమాయాత్తమయ్యారు. దీనికి కావాల్సిన డబ్బుల కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి లక్ష రూపాయల రుణం తీసుకున్నారు. అయితే ఈ ప్రయత్నం ఏమీ.. అంత ఆషామాషీగా సాగలేదని స్టెల్లా, ఆమె వ్యాపార భాగస్వాములు ఉమా, సిల్వరాణి, రాజ్‌కుమారి, గీతా, సరోజలు చెబుతున్నారు. ఇంట్లో రోజువారీ ఖర్చులు, పిల్లల చదువుల కోసం .. తాము ప్రారంభించిన ఈ పోరాటం .. ఇప్పుడు తమ గ్రామంలోని మహిళలకు గౌరవాన్ని తెచ్చిందని, దీంతో వారందరూ తమకు వీలైన పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారని అంటున్నారు. రుణం తీసుకునేప్పుడు .. తమను గ్రామంలోని కొందరు విమర్శించారని, తప్పు పని చేస్తున్నట్లు భావించారని, వాటన్నింటికీ ఎదురొడ్డి, నిలబడ్డామని వీరంతా విజయగర్వంతో చెబుతున్నారు.

women empowerment Beach Restaurant Eran 50000 monthly

women empowerment Beach Restaurant Eran 50000 monthly

ఇంటా బయటా గౌరవప్రదంగా.. women empowerment

ఈ ప్రాంతంలో మత్స్యకారులు, పర్యాటకులు, చేపల అమ్మకందారులు, నౌకాశ్రయ సిబ్బంది .. ఎక్కువగా ఉంటారని, అందుకే తాము విజయం సాధించగలిగామని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. తమ భర్తల సహకారమేనని, తమకు అన్నివేళలా వారి నుంచి సహకారం లభించిందని చెబుతున్నారు. అయితే ఎదురయ్యే సమస్యలపైనా ముందుగానే తమ భర్తలు సూచనలు చేశారని, వాటివల్లే తాము ధైర్యంగా నిలబడగలిగామని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కొందరితో ముఖ్యంగా తాగుబోతులతో సమస్యలు ఎదురైనా, కుటుంబసభ్యులు, స్థానికుల సహకారంతో అధిగమించగలిగామని చెబుతున్నారు. తాము చేపట్టిన పని వల్ల తమకు గౌరవం లభిస్తోందని, కుటుంబ ఆర్థిక లావాదేవీల్లో ముఖ్య పాత్రను పోషించగలుగుతున్నామని అంటున్నారు. తమ పిల్లల చదువుకు కావాల్సిన ఆర్థిక సదుపాయం తామే చూసుకోగలుగుతున్నామని, ఇళ్ల నిర్మాణానికి తాము ఆర్థికంగా నిలబడడంతో, అటు కుటుంబంలోనూ, ఇటు గ్రామంలోనూ విలువ పెరిగిందని చెబుతున్నారు. ఇంతకుముందు హేళన చేసిన వారు సైతం.. తమను మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారని, గొప్ప పని చేస్తున్నారని అంటున్నారన్నారు.

women empowerment Beach Restaurant Eran 50000 monthly

women empowerment Beach Restaurant Eran 50000 monthly

రుచి చూస్తే.. చాలు.. women empowerment

వెదురుతో తయారు చేసిన హోటల్లో చేపల కూర, సాంబారు, రసం, పెరుగు, శాఖాహార కూరలతో భోజనం అందిస్తున్నామని, అంతేగాక ఇడ్లీ, పూరి, పొంగల్, వడైలను తయారు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తే, సాయంత్రం 6 గంటలకు రెస్టారెంట్ మూసివేస్తామని, చేపలే జీవనాధారంగా బతికే తాము తమ హోటల్ కు కూడా డాల్ఫిన్ అనే పేరు పెట్టుకున్నామని చెబుతున్నారు. తామేమీ … హోటల్ గురించి ప్రచారం చేయనక్కరలేదని, తమ ఆహారాన్ని రుచి చూసిన వారే .. ప్రచారం చేస్తారని వీరంతా ధీమాగా చెబుతున్నారు. ఐదుగురూ కలిసి సామాగ్రి కొనుగోలు, వంట నిర్వహణ, ఆర్డర్ల స్వీకరణ .. ఇలా అన్ని పనుల్నీ కలిసే చేస్తామని.. దీంతో గ్రామంలోనే మహిళలతోనే మహిళలే నిర్వహించే హోటల్ తమదేనని చెబుతున్నారు. ఇప్పుడు రోజువారీ వ్యాపారంతో పాటు, కుటుంబ కార్యక్రమాలు, వివాహాలు, అంత్యక్రియలు, పుట్టినరోజుల కోసం ఆర్డర్లు స్వీకరిస్తున్నామని, తమ వంటల్లో ఇడ్లీ సాంబార్, పూరి, ఫిష్ కర్రీ, శాఖాహారం కూర వతా కుజాంబు అత్యంత ప్రాచుర్యం పొందాయని చెబుతున్నారు. దీనిద్వారా తామంతా నెలకు 50 వేలు సంపాదిస్తున్నామని, ఈ పని తమకు ఆర్థిక స్వాతంత్రాన్నే కాక .. సమాజంలో గౌరవాన్ని, కుటుంబంలో గుర్తింపును తెచ్చి పెట్టిందని వీరంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. త్వరలోనే సొంతంగా స్థలాన్ని కొనుగోలు చేసి, హోటల్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని అంటున్నారు.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది