Husband Wife : భార్య బాత్‌రూంకి వెళ్లినప్పుడు… భర్త అనుమానంతో ఇలా చేశాడేంటి..?
ప్రధానాంశాలు:
Husband Wife : భార్య బాత్‌రూంకి వెళ్లినప్పుడు... భర్త అనుమానంతో ఇలా చేశాడేంటి..?
Husband Wife : కాన్పూర్‌లోని బితూర్ ప్రాంతంలో ఓ వివాహిత దంపతుల మధ్య చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఓ వ్యక్తి తన భార్యను అనుమానించి, ఆమె మొబైల్ ఫోన్‌లో కాల్ రికార్డింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య తీవ్రంగా కోపగించుకుంది. భర్తపై రోలింగ్ పిన్ విసిరేసి, అతన్ని ఇంటి నుండి బయటికి పంపించింది. భయపడి భర్త నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

Husband Wife : భార్య బాత్‌రూంకి వెళ్లినప్పుడు… భర్త అనుమానంతో ఇలా చేశాడేంటి..?
Husband Wife : భార్య పై అనుమానంతో భర్త ఏంచేసాడో తెలుసా..?
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించగా భర్త తన భార్యను అనుమానించడమే అసలు కారణమని తేలింది. తన భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితోనో మాట్లాడుతుందని భావించిన భర్త, ఆమె ఫోన్‌లో రహస్యంగా రికార్డింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. అతను పని ముగించుకుని ఇంటికి వచ్చాక భార్య సంభాషణలను వినడం మొదలుపెట్టాడు. ఇదంతా గమనించిన భార్య తీవ్ర అసహనానికి గురై భర్తతో గొడవపడింది. చివరకు భర్తను ఇంటి నుండి పంపించేసింది.
ఈ వివాదంపై తగిన చర్యలు తీసుకునే ముందు పోలీస్ స్టేషన్‌లో ఇన్‌చార్జ్ ఆ దంపతులను కూర్చోబెట్టి మాట్లాడించాడు. భర్త తన భార్యను అనుమానించడమే పెద్ద సమస్యగా మారిందని పోలీసు అధికారులు గుర్తించారు. గంటపాటు జరిగిన కౌన్సిలింగ్ అనంతరం భర్త తన తప్పును అంగీకరించి, భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయబోనని హామీ ఇచ్చాడు. చివరకు ఇద్దరూ కలిసిపోతూ హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్లారు. పోలీసులు భర్త మొబైల్‌లో ఉన్న కాల్ రికార్డింగ్ యాప్‌ను కూడా తొలగించి, సమస్యను పరిష్కరించారు.