Huzurabad bypoll : త్వరలో ఉపఎన్నిక షెడ్యూల్.. ఈటల ఇంకా కోలుకోలేదు.. దూకుడు మీదున్న టీఆర్ఎస్?
Huzurabad bypoll తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ పెంచుతున్న హుజారాబాద్ ఉప ఎన్నిక Huzurabad bypoll కు సర్వం సిద్ధమవుతోంది. ఈటల రాజేందర్ రాజీనామా తరువాత జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటు అధికార టీఆర్ఎస్ ఈటల రాజేందర్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని చూస్తోంది. అటు నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకోవాలని బీజేపీ తరపున ఈటల రాజేందర్ సైతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా.. కాంగ్రెస్ బోణీ కొట్టేలా చేయాలని ఆరాటపడుతున్నారు. దీంతో మూడు పార్టీలకు ఈ ఎన్నిక డూ ఆర్ డైగానే మారాయి. దీంతో ఈ ఎన్నికపైనే ఫోకస్ చేశాయి.
ముఖ్యంగా అధికార పార్టీ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ కొన్ని రోజుల నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. మరోవైపు ఎన్నికకు వెంటనే సిద్ధమవ్వాలని టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ హింటిచ్చినట్టు తెలుస్తోంది. వారం రోజులుగా ముమ్మరంగా సాగుతున్న ఆయా పార్టీల కార్యకలాపాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. అయితే వాసాలమర్రి దళితవాడను సీఎం సందర్శించిన నేపథ్యలో దళితబంధు లబ్దిదారుల ఎంపిక, చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించడానికి హుజూరాబాద్ ఉపఎన్నిక Huzurabad bypoll షెడ్యూలు విడుదల సంకేతాలందడమే కారణమనే ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే అందిన సంకేతాలు.. Etela Rajendar
టీఆర్‌ఎస్‌లో పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేరికలకు సీఎం కేసీఆర్ స్వయంగా హాజరవడం, కౌశిక్‌రెడ్డిని మూడ్రోజుల క్రితం గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయడం వంటి పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. మంత్రి హరీశ్‌రావు.. హుజూరాబాద్‌లో పార్టీ సమన్వయంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. మరో మంత్రి గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో మకాం వేశారు. దీనికంతటికీ ఉపఎన్నిక షెడ్యూలుపై సంకేతాలు రావడమే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందని టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
పాదయాత్రలో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఆయన కోలుకునేందుకు 15 రోజులు పడుతుందని సన్నిహితులు అంటున్నారు.అయితే, ఈటెల రాజేందర్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే, హుజూరాబాద్ వెళ్తారని తెలుస్తోంది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకుండానే ఈటల హుటాహుటీన నియోజకవర్గానికి వెళ్లడం వెనుక ఉపఎన్నిక షెడ్యూలు వార్తలే కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమై హుజూరాబాద్ ఉపఎన్నికపై చర్చించింది. మూడు ప్రధాన పార్టీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూలు వారాంతంలోగా వెలువడుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి.