Husband Wife : భార్య భర్తని ఈ పేరుతో పిలిస్తే ఆయుష్ తగ్గిపోతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Husband Wife : భార్య భర్తని ఈ పేరుతో పిలిస్తే ఆయుష్ తగ్గిపోతుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :27 October 2023,10:00 am

Husband Wife : ఒకప్పుడు పెళ్లికి సంబంధించిన ఆచార్య వ్యవహారాలతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని చెప్పాలి. అప్పట్లో పెళ్లి కొడుకుని పెళ్లయినంతవరకు కూడా పెళ్లికూతురు కనీసం కన్నెత్తైనా చూసే వీలు ఉండేది కాదు. పెద్దలు చెప్పినట్లు అయితే ఇప్పుడు కాలం బాగా మారిపోయింది. పెళ్లి కొడుకుని చూసి అంతా నచ్చితేనే పెళ్లి చేసుకుంటున్నారు..కొందరు అయితే డైటింగ్ చేసి తమకు సెట్ అవుతారు అనుకుంటే కాని పెళ్లి చేసుకునేవారు కాదు… భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి. భారం కాకూడదు భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి. సంసారం అంటే కలిసి ఉండడం కాదు.. కష్టాల్లో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వీడకుండా ఉండడం..

నలుగురిలో మీ భర్తని పేరు పెట్టి పిలవడం వలన వారిలో మీ భర్త గౌరవం తగ్గడమే కాకుండా మీ గౌరవము తగ్గుతుంది. గతంలో అయితే తల్లి పేరును కలుపుతూ పిలిచేవారు. ఉదాహరణకు గౌతమీపుత్ర అని పిలిచేవారు. ఇప్పుడు తల్లి పేరుతో కలిపి పిలవడం ఆచరణ అసాధ్యం కాబట్టి ఏమండీ అని అనురాగం మాధుర్యంతో బావగారు అనే ఆత్మీయతతో పిలిస్తే మంచిది. అలాగే అప్పట్లో భర్తను ఏవండీ వంటి పిలుపులతో మర్యాదపూర్వకంగా సంభోదించేవారు. భర్తను భార్య పేరు పెట్టి పిలవడం అంటే మహా పాపంగా అతనికి ఆయుర్వేదం అను భావించేవారు. అలాంటిది ఇప్పుడు చాలామంది భర్తను పేరు పెట్టి పిలవడం అయిపోయింది. మీ ఆయనను శ్రీవారు అని పిలవండి. ఇలా పిలవడం వలన మీ ఆయనకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. మన తెలుగు వాళ్ళు కొన్ని చోట్ల మాత్రమే పిలుస్తారు.

కానీ ఇలా పిలవడం వలన మనసు పూర్తిగా ఆప్యాయంగా పిలిచారు అనే భావన మగవారికి వస్తుంది. అంటే నమ్మండి మీకోసం ఏమైనా చేస్తాను బంగారం, బుజ్జి అంటు మిమ్మల్ని మరింత ప్రేమగా చూసుకుంటారు. ప్రస్తుతం భార్యలు తమ భర్తలను ఎక్కువగా పేరు పెట్టి పిలుస్తున్నారు. పేరు పెట్టి లేదా ముద్దుగా అందరి ముందు కాకుండా మీరు ఇద్దరు ఉన్నప్పుడు పిలుచుకోండి. బాగుంటుంది… మీ భర్తని పేరు పెట్టి పిలిస్తే మహా పాపం అలాగే వారి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మీరు మీ భర్తని శ్రీవారు లేదా బావ, మామ అని పిలిస్తే అంత శుభమే జరుగుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది