Turmeric | పసుపు నీటిలో ఆరోగ్య రహస్యాలు .. ప్రతిరోజూ పరగడుపున తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు!
Turmeric | మన వంటింట్లో నిత్యం కనిపించే పసుపు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధగుణాలతో నిండి ఉంటుంది. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు శరీరాన్ని రోగాల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఏ చిన్న గాయం జరిగినా పెద్దలు “పసుపు రాయండి” అని సూచిస్తారు. ఇక నిపుణుల చెబుతున్న వివరాల ప్రకారం, రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో పసుపు కలిపి తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

#image_title
ఎన్నో ప్రయోజనాలు..
ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపుతో పసుపు నీటిని తాగడం వల్ల శరీరంలో దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇది ఒక ప్రకృతిసిద్ధమైన డిటాక్స్ వంటి పని చేస్తుంది.పసుపు నీటిలో ఉండే ఆమ్లతత్వం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఈ నీటిని రోజూ తాగితే వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు, సీజనల్ ఫీవర్లు వంటి వ్యాధులు దరిచేరవు.పసుపు నీరు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల్ని తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఊబకాయం సమస్యతో బాధపడేవారు పసుపు నీటిని తీసుకుంటే మెటబాలిజం వేగంగా జరిగి శరీర బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పసుపు నీరు శరీరంలోని మలినాలను తొలగించి, కొవ్వు కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.