Life Partner : లైఫ్ పార్ట్ నర్ ఇలా చేస్తే ఖచ్చితంగా అనుమానించాల్సిందే.. అవేంటో తెలుసుకోండి…
Life Partner : భార్య భర్తల బంధాన్ని మన దేశంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఎన్నో ఆచారాలు సాంప్రదాయల నడుమ ఒక్కటవుతారు. అయితే ఈ బంధం కలకాలం నిలవడానికి మాత్రం ఒకరిపై మరొకరికి నమ్మకం తప్పనిసరిగా ఉండాలి. నమ్మకం లేకుంటే ఆ జీవితం సాఫీగా సాగదనే చెప్పాలి. భార్యభర్తలు హ్యాప్పీగా ఉండాలన్నా.. హాయిగా గడపాలన్నా ఇద్దరి మధ్య ఎలాంటి భేదాలు ఉండకూడదు. అన్ని విషయాలు చర్చించుకోవాలి.. ఏ విషయాన్ని కూడా దాచడానికి ప్రయత్నించ వద్దు. అలాకాకుండా పలు విషయాలు దాచినా.. మన ప్రవర్తనలో తేడా వచ్చినా భాగస్వామి మోసం చేస్తున్నాడని భావిస్తారు.
ప్రస్తుత కాలంలో ఎన్నో రిలేషన్ షిప్స్ చూస్తున్నాం.. భర్త కాకుండా మరొకరితో చనువుగా ఉంటున్నారు. అలాగే భర్యకు తెలియకుండా భర్త మరొకరితో కలిసి ఉంటున్నారు. అయితే ఇలాంటి విషయాలు మీ భాగస్వామిలో ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు జీవిత భాగస్వామి దగ్గర నచ్చిన విషయాలు ఒక్కసారిగా నచ్చకుండా పోతాయి. తరుచు పోన్ చెక్ చేసుకుంటూ ఓ ధ్యాసలో ఉంటారు. జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనే విషయాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Life Partner : ప్రవర్తనలో మార్పు గమనించాలి…
కొంతమంది తమ జీవిత భాగస్వామి మరో అమ్మాయితో చనువుగా మాట్లాడిన సహించలేరు. అదే విధంగా మగవారు కూడా తమ భార్యలు వేరొక వ్యక్తితో గాని స్నేహంగా ఉన్నా, ఎక్కువగా మాట్లాడుతున్న తట్టుకోలేరు. ఇలాంటి వారు ఈ చిన్న విషయానికి జీవిత భాగస్వామిని అనుమానిస్తుంటారు. కానీ తన అనుమానమే నిజం అనే విషయాన్ని ఎలా గుర్తించాలి అంటే.. భార్య లేదా భర్త తమ ఫోన్ లో ఎక్కువ సమయం గడుపుతున్నా..ఫోన్ ఇవ్వకుండా ప్రతి విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తే అప్పుడు తప్పకుండా అనుమానించాల్సిందే.. అయితే ఇలాంటి సమయాల్లో ఒక్కోసారి నిజ లేకపోవచ్చు.. అందుకే వారి ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని వారికి తెలియకుండా చెక్ చేసుకోవాలి..
అలాగే చాలామంది బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో చెప్పి వెళ్తారు. అయితే బయటకు వెళ్లేటప్పుడు చెప్పకుండా.. అడిగినా చెప్పడానికి సందేహించినప్పుడు వారు మీ దగ్గర ఏదో దాయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే ఇదివరకు లేని కొత్త అలవాట్లు చేసుకుంటూ అందంపై ఎక్కువగా దృష్టి పెట్టడం… అలాగే పార్ట్ నర్ ఇష్టాలను చిరాకు పడటం.. కేర్ తీసుకోకపోవడం గమనిస్తే అప్పుడు ఎందుకు అలా చేస్తున్నారో దృష్టి పెట్టాలి. అలాగే ప్రతి విషయానికి కంగారు పడుతుండటం, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా చెబుతారేమోనని కంగారు పడటం వంటివి చేస్తే కూడా గుర్తించాలి.